సినిమాసినిమాలను పైరసీ చేసే యంగ్ హీరో

Imran Khan

సినిమాలను పైరసీ చేసి అమ్మటం నేరం..అలాగే సినిమా వాళ్ళకు పైరసీ చేసేవాళ్లంటే మహా మంట. అయితే ఇప్పుడు అదే పైరసీ పాయింట్ చుట్టూ కథ అల్లేసి బాలీవుడ్ ఓ సినిమా తీయటానికి రెడీ అయిపోతోంది. 'మిలన్‌ టాకీస్‌'అనే టైటిల్ తో రూపొందే ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. బాలాజీ మోషన్‌ పిక్చర్స్‌ సంస్థ తాజా చిత్రాన్ని నిర్మించబోతోంది. 'పాన్‌ సింగ్‌ తోమార్‌' దర్శకుడు తిగ్మాన్షు ధులియా ఈ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేసుకున్నారు. 

మొదట ఈ కథను ప్రతీక్‌ బబ్బర్‌కి వినిపించారు. ఆయనే హీరోగా నటిస్తారని ప్రచారం కూడా సాగింది. అయితే ఇటీవల ఆయన నటించిన 'ఏక్‌ దీవానా థా' విడుదలై నిరాశ మిగిల్చింది. దీంతో దర్శకుడు ఇమ్రాన్‌ ఖాన్‌ని సంప్రదించి కథ వినిపించినట్లు తెలిసింది. ఆయన కూడా పచ్చజెండా ఊపారట. ఉత్తర భారతదేశంలోని ఓ చిన్న పట్టణంలో నివసించే యువకుడి కథ ఇది. బాలీవుడ్‌లో వచ్చే విజయవంతమైన సినిమాల్ని పైరసీ చేసి డబ్బులు సంపాదిస్తుంటాడు. అతని చుట్టూనే సినిమా తిరుగుతుంది. 'పాన్‌ సింగ్‌ తోమార్‌' విడుదలవగానే 'మిలన్‌ టాకీస్‌'ను మొదలుపెడతారని సమాచారం. మొత్తానికి పైరసీ కూడా సనీ వస్తువు అయ్యిందన్నమాట.
ఆటోనగర్‌ సూర్య' కాన్సెప్టు ఏమిటి
నాగచైతన్య,దేవకట్టా కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'ఆటోనగర్‌ సూర్య'. ఆ చిత్రంలో నాగచైతన్య టైటిల్ రోల్ లో సూర్య పాత్రలో కనపించనున్నారు. ఆ చిత్రం గురించి చెపుతూ దర్సకుడు దేవకట్టా...ఆ వూరికి వెళ్లి సూర్య పేరు చెబితే చాలు... ఆ ఆటోనగర్‌ సూర్యేనా? అంటూ మొదలుపెడతారు. ఆటోనగర్‌ ఎంత ఫేమసో... అక్కడుండే సూర్యకి కూడా అంతే పేరు మరి. నలుగురి కష్టసుఖాల గురించి ఆలోచించే ఆ యువకుడికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో తెరపైనే చూడాలన్నారు.

యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న 'ఆటోనగర్‌ సూర్య'లో నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్నారు. మ్యాక్స్‌ ఇండియా ప్రొడక్షన్స్‌ పతాకంపై కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. నృత్య దర్శకుడు రాజుసుందరం నేతృత్వంలో నాగచైతన్య-సమంతపై ఓ పాటని తెరకెక్కిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ''వినోదం, మాస్‌ అంశాల మేళవింపుతో తెరకెక్కుతున్న చిత్రమిది. 

ఆటోనగర్‌ అడ్డాగా చేసుకొన్న ఓ యువకుడు సాధించిందేమిటో తెరపైనే చూడాలి. నాగచైతన్యని ఒక కొత్త కోణంలో తెరపై ఆవిష్కరిస్తున్నాం. అనూప్‌ చక్కటి పాటలు సమకూర్చారు. అన్నివర్గాల ప్రేక్షకుల్నీ మెప్పించే చిత్రమవుతుందని అన్నారు. సాయికుమార్‌ ఓ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. సమర్పణ: ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌.

మంచు లక్ష్మి ప్రసన్న..‘లక్ ఉంటే లక్ష్మి’

మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ప్రసన్న తొలుత టీవీ షోల ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. ‘లక్ష్మి టాక్ షో’, ‘ప్రేమతో మీ లక్ష్మి’ కార్యక్రమాల ద్వారా పాపులర్ అయిన ఈ భామ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం నిర్మాతగా పలు సినిమాలను నిర్మిస్తోంది. ‘గుండెల్లో గోదారి’ చిత్రంలో నటించడంతో పాటు ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. 

తాజాగా లక్ష్మి మరో టీవీ షోను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ‘లక్ ఉంటే లక్ష్మి’ పేరుతో ప్రసారం కానున్న ఈ షోలో పాల్గొనే వారు లక్కు ఉంటే డబ్బు, బహుమతులు గెలుచుకోవచ్చు అనే కాన్సెప్టుతో రూపొందిస్తున్నారు.

గుండెల్లో గోదారి చిత్రం ద్వారా లక్ష్మి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. స్వయంగా ఆమెనే నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా తమిళ్ లోనూ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో తమిళ నటుడు ఆదిని హీరోగా ఎంపిక చేయడం వెనక కారణం అదే అంటున్నారు. మరో వైపు తమిళంలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం నిర్మించే చిత్రంలోనూ అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం లక్ష్మి రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న బాలీవుడ్ మూవీ ‘డిపార్ట్ మెంట్’లో సంజయ్ దత్ భార్యగా నటిస్తున్న సంగతి తెలిసిందే.


సునీల్ 'పూలరంగడు' స్టోరీ లైన్ ఏమిటి
రియల్‌ ఎస్టేట్‌ రంగంలో కోట్లు సంపాదించి కోటలు కట్టేద్దాం అనుకుంటాడు రంగా. కాలం కలిసి రాలేదు. ఏం చేయాలా? అని ఆలోచిస్తున్న తరుణంలో ఓ అందాల భామ వలపు వల విసురుతుంది. ఆ తరవాత జరిగిన పరిణామాలేమిటి? అన్నదే పూలరంగడు కాన్సెప్టు అంటున్నారు నిర్మాత కె అచ్చిరెడ్డి. ఆయన నిర్మించిన చిత్రం 'పూలరంగడు'ఈ నెల 18న గ్రాండ్ గా విడుదల అవుతోంది. ఈ చిత్రంలో సునీల్‌, ఇషాచావ్లా జంటగా నటించారు. ఈ సందర్భంగా దర్శకుడు వీరభద్రమ్‌ చౌదరి మాట్లాడుతూ ...సునీల్‌ - ఇషాల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు కడుపుబ్బ నవ్విస్తాయి. దీంట్లో సునీల్‌ సిక్స్ పాక్ తో కనిపిస్తారు. ఆయన చేసే ఫైట్స్ ఉత్కంఠ రేకెత్తిస్తాయని అన్నారు. ఇక కోట శ్రీనివాసరావు, అలీ, ప్రదీప్‌రావత్‌, రఘుబాబు, దేవ్‌గిల్‌, పృధ్వీ, సుధ, ప్రగతి తదితరులు ఇతర పాత్రధారులు. సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, సమర్పణ: ఆర్‌.ఆర్‌.మూవీ మేకర్స్‌.నయన దూరం - శ్రీకాళ‌హస్తిలో ప్రభుదేవా పూజలు


సినీ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా శనివారం శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో సర్పదోష నివారణ పూజలు నిర్వహించారు. ఒంటరిగానే వచ్చిన ఆయన పూజా కార్యక్రమం ముగిసిన అనంతరం అక్కడి నుంచి వెళ్లి పోయారు. 
తన ప్రియురాలు నయనతార దూరం అయిన నేపథ్యంలో....ప్రభుదేవా ఈ పూజలు నిర్వహించినట్లు చర్చించుకుంటున్నారు.

పెళ్లి వరకు వచ్చిన నయనతార-ప్రభుదేవా వ్యవహారం గత కొన్ని రోజుల క్రితం తారుమారైంది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడివిడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో నయనతారను ప్రభుదేవా మోసం చేశాడని, డబ్బు కోసం ప్రేమ నాటకం ఆడి ఆమెను నిండా ముంచాడని నయనతార కుటుంబ సభ్యులు ఆరోపించడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.

ఓ వైపు చూస్తే నయనతార కోసం ప్రభుదేవా తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి వదిలించుకున్నాడు. మరో వైపు ప్రభుదేవాను పెళ్లి చేసుకోవడం కోసం నయనతార చాలా త్యాగాలు చేసింది. మతం మార్చుకుంది. సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. కళ్ల దగ్గరకు వచ్చిన పెద్ద అవకాశాలను కాదనుకుంది. ఈ తరుణంలో ఇద్దరి మధ్య పొరపొచ్చాలు ఎందుకు వచ్చాయి? అనేది మాత్రం ఎవరికీ అంతుపట్టడం లేదు.
కర్నాటకలో రాజమౌళి‘ఈగ’ దుమారం!
హిట్ చిత్రాల దర్శకుడు రాజమౌళి తాజాగా ‘ఈగ’ అనే సాంకేతిక అద్భుతమైన సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం భారత దేశ సీని చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన గ్రాఫిక్స్ తో రూపొందిస్తున్నారని, చిత్రీకరణ కోసం హాలీవుడ్ రేంజ్ టెలిస్కోపిక్ కెమెరాలు వాడుతున్నారని చర్చించుకుంటున్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం మార్చి 9న ఈ చిత్ర ఆడియో లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆస్తి‌కర విషయం ఏమిటంటే...కర్నాటకలో ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించే దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న కన్నడ స్టార్ సుదీప్ కు అక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో గ్రాండ్ రిలీజ్ చేసి అత్యధిక కలెక్షన్లు సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడి డిస్ట్రి బ్యూటర్లు కూడా సినిమాపై చాలా ఆసక్తి చూపుతున్నారు. కర్నాటక రైట్స్ ను దాదాపు రూ. 3 కోట్ల వరకు చెల్లించి దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. అయితే నిర్మాతలు అంతకంటే ఎక్కువ ఆశిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

భారత దేశ సినీ పరిశ్రమ గర్వించే రేంజ్ లో సినిమా రూపొందుతోంది అంటే...ఈ సినిమా దుమారం అటు కర్నాటకలో, ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరో రెండు నెలల్లో సినిమా విడుదల కానుంది. అప్పుడుగానీ తెలియదు ఈగ సత్తా ఏమిటో. సమంత, నాని, సుదీప్ ఈచిత్రంలో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం : ఎం.ఎం. కీరవాణి, సినిమాటోగ్రఫీ కె.కె.సెంథిని, ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాత : సాయి కొర్రపాటి, దర్శకత్వం : ఎస్.ఎస్. రాజమౌళి1 వ్యాఖ్య:

Unknown చెప్పారు...

what a crazy blogs i'm following your blogs please give some suggestions please subscribe and support me my youtube channel garam chai:www.youtube.com/garamchai