5 జులై, 2012

బూతులు ఉన్నాయో లేవో..కానీ ‘అలీ’ ఉన్నాడు!
అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ హీరోగా బాలీవుడ్‌లో రూపొందించిన ‘ఢిల్లీ బెల్లి' చిత్రం ఆ మధ్య విడుదలై భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో బాగా బూతులు ఉండటంతో దానికి A సర్టిఫికెట్ జారీ చేశారు సెన్సార్ బోర్డు సభ్యులు. ఈ చిత్రంలో బూతులు ఉన్నాయని స్వయంగా అమీర్ ఖానే ఆ మధ్య ప్రకటించారంటే విషయం ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
తాజాగా ఢిల్లీ బెల్లి చిత్రం తమిళంలో ‘సెత్తయ్' పేరుతో రీమేక్ అవుతోంది. ఈచిత్రంలో తెగులు కమెడియన్ ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. ఆర్య, సంతానం ప్రదాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

హిందీ మాదిరి ‘సెత్తయ్'లోనూ బూతులు ఉంటాయా? ఉండవా? అనేది సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఉన్నది ఉన్నట్లు బూతులు దించితే మాత్రం విమర్శలు తప్పవు. ఎందుకంటే ఉత్తరాది ప్రేక్షకులు భరించినంత బూతును దక్షిణాది ప్రేక్షకులు అమోదించ లేరు. ఈ చిత్రానికి ఆర్ కన్నన్ దర్శకత్వం వహించనున్నారు.