5 జులై, 2012

శ్రీలంక పర్యటన నుండి సచిన్‌ అవుట్: సెహ్వాగ్, జహీర్‌, ఓజాలకు చోటు


శ్రీలంక పర్యటనలో టీమిండియా జట్టు ఎంపిక అంతా ఊహించినట్లే జరిగింది. శ్రీలంక పర్యటన నుండి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు విశ్రాంతి కల్పించగా.. ఆసియా కప్‌లో ఎంపిక అవ్వని టీమిండియా ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్‌లకు పదహేను మంది సభ్యుల జట్టులోకి తీసుకున్నారు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు ఈసారి బిసిసిఐ మొండి చెయ్యి చూపించింది.

జులై 21 నుండి శ్రీలంకలో ప్రారంభం కానున్న ఐదు అంతర్జాతీయ వన్డేలు, ఒక ట్వంటీ20 మ్యాచ్ సిరిస్‌కు బిసిసిఐ సెలక్షన్ కమిటీ ఈరోజు జట్టుని ఎంపిక చేసింది. తొలి వన్డే 'అంబన్‌టోటా' స్టేడియంలో ప్రారంభం కానుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)-5వ సీజన్ తర్వాత చాలా కాలం బ్రేక్ తీసుకోని భారత్ జట్టు పాల్గోంటున్న వన్డే సిరిస్ ఇది. ఇక శ్రీలంక పర్యటన నుండి సచిన్ టెండూల్కర్ స్వయంగా తప్పుకున్నట్లు సమాచారం.

ఇక పఠాన్ బ్రదర్సైన యూసఫ్, ఇర్పాన్‌లు సెలక్షన్ కమిటీ ప్రకటించిన పదహేను మంది ఆటగాళ్లలో లేరు. ఐతే వీరిద్దరూ ఆసియా కప్‌కు ఎంపికైన స్క్వాడ్ లో ఉన్నారు. లంక పర్యటనకు స్పిన్నర్లు కూడా అవసరం అవడంతో ఎడమ చేతి వాటం స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజాకు స్దానం కల్పించారు. వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హార్బజన్ సింగ్‌ని ఎప్పటిలాగే మరచారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)-5వ సీజన్‌లో అద్బతంగా రాణించిన అజ్యెంక రహానేకి అవకాశం కల్పించారు.

మార్చిలో జరిగిన ఆసియా కప్‌లో టీమిండియా బంగ్లాదేశ్‌తో ఆడిన మ్యాచ్ చివరి మ్యాచ్. ఆ తర్వాత మార్చి 30వ తారీఖున జోహెన్స్ బర్గ్‌లో ప్రవాస భారతీయుల కోసం దక్షిణాఫ్రికాలో అంతర్జాతీయ ట్వంటీ20ని ఆడారు. ఆసియా కప్‌లో భాగంగా క్రికెట్ దేవడు సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీల మైలురాయిని అందుకున్నాడు. సెలక్షన్ కమిటీ ఛైర్మన్ కృష్ణమాచారి శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ మాకు అందుబాటులో ఉన్న బెస్టు ఆటగాళ్లను సెలక్ట్ చేశామని సమర్దించుకున్నారు.

శ్రీలంక వన్డే సిరీస్, ట్వంటీ 20 కోసం భారతదేశం స్క్వాడ్:

మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్), విరాట్ కోహ్లీ (వైస్ కెప్టెన్), గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, సురేష్ రైనా, రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, జహీర్ ఖాన్, ప్రగ్యాన్ ఓఝా, వినయ్ కుమార్, రాహుల్ శర్మ, మనోజ్ తివారీ, అశోక్ దిండా, అజ్యెంక రహానే, ఉమేష్ యాదవ్.

ఇండియా వర్సెస్ శ్రీలంక వన్డే సిరిస్ షెడ్యూల్: 

Jul 21: 1st ODI, Sri Lanka Vs India Hambantota Cricket Stadium
Jul 24: 2nd ODI, Sri Lanka Vs India Hambantota Cricket Stadium
Jul 28: 3rd ODI, Sri Lanka Vs India R Premadasa Stadium, Colombo
Jul 31: 4th ODI, Sri Lanka Vs India R Premadasa Stadium, Colombo
Aug 4: 5th ODI, Sri Lanka Vs India Pallekele Cricket Stadium
Aug 7: Only Twenty20, Sri Lanka Vs India Pallekele Cricket Stadium