14 జులై, 2012

నడిరోడ్డుపై కాల్చేయాలి: టిజి వెంకటేష్ సంచలన వ్యాఖ్య
కర్నూలు: చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పని చేయని రాజకీయ నాయకులు, అధికారులను నడి రోడ్డుపై నిలబెట్టి కాల్చినా పాపం లేదంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన శుక్రవారం కర్నూలు జిల్లాలో చిన్న నీటి పారుదల శాఖ నూతన కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొంతమంది ఐఏఎస్ అధికారులు పని చేయకుండా కుర్చీలకే అతుక్కు పోతున్నారని మండిపడ్డారు.

తాను హానెస్ట్ అధికారినని కొందరు చెబుతుంటారని, ప్రజలకు పని చేయనప్పుడు హానెస్ట్ ఏంటని ప్రశ్నించారు. హానెస్ట్ ముఖ్యం కాదని పని చేయడం ముఖ్యమన్నారు. ఒక పని చేయలేని అధికారి ఉంటే ఆ వ్యవస్థ మొత్తం కుప్పకూలుతుందని అన్నారు. కొందరు ఐఏఎస్ అధికారులకు తలబిరుసు అన్నారు. ప్రజలకు సేవ చేయని అధికారులనే కాదు రాజకీయ నేతలనూ కాల్చి చంపినా తప్పు లేదన్నారు.

అధికారులు పని చేయకపోతే అమెరికా విధానాన్ని అమలపరుచాలన్నారు. అలా అయితే వ్యవస్థ బాగుపడుతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం మారగానే వ్యవస్థ కూడా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా టిజి వెంకటేష్ సంచలనాలకు మారుపేరు. తెలంగాణ విషయమైనా మరే విషయమైనా సూటిగానే ధాటిగా స్పందిస్తారు.

ప్రత్యేక తెలంగాణ విషయంలో ఆయన తెలంగాణవాదులకు పలుమార్లు హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఆయన తెలంగాణవాదులపై తన ఎదురుదాడి తగ్గిస్తానని చెప్పారు. ఇక నుండి తాము సై అంటే సై అనమని, తెలంగాణవాదులను ప్రేమతో మసులుకుంటామని చెప్పారు.

3 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

బాధ్యతా రహితంగా, చట్టవ్యతిరేకంగా, ఇట్లా నోటికొచ్చినట్టు మాట్లాడే నేతల్ని
మన న్యాయ వ్యవస్థ సుమోటోగా న్యూ సెన్స్ కేసు గా స్వీకరించి
కనీసం చివాట్లు పెడితే నైనా సమాజానికి మేలు జరుగుతుంది.
- యాదగిరి, హైదరాబాద్

అజ్ఞాత చెప్పారు...

ఇలాంటి పిచ్చికుక్క నాయకులను పీకల దాకా నడిరోడ్డు మధ్య పూడ్చాలి. ప్రజలు సెప్పుతో మర్ధన సేవ చేసుకునేందుకు వీలుగా తల కనిపించేలా పైనే వుంచాలి,
ఇలాంటి ఎదవలకు మత్రివర్గంలో కొదువలేదు. తలమాసిన డి.ఎల్, విద్యుత్ సరఫరాలో పాకిస్తాన్ కంటే మనమే బెటర్ అని వాగాడు, ఇథియోపియా, సోమాలియా కన్నా అంటూ దిగజారుతాడేమో.

అజ్ఞాత చెప్పారు...

I agree with you both

He is a stupi, right place for this buffoon is Chanchalguda jail, in cell beside Jaggu.

Snkr