17 జులై, 2012

కొడుకు దర్శకత్వంలో అమీర్ ఖాన్
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ త్వరలో కొడుకు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. అయినా అమీర్ ఖాన్‌కి దర్వకత్వం చేసేంత పెద్ద కొడుకు ఉన్నాడా? అని ఆశ్చపోనక్కర్లేదు. అతని పేరు జునైద్. వయస్సు 17. అమీర్ మొదటి భార్య రీనా దత్త సంతానం.

17 ఏళ్లకే దర్శకత్వం చేసేంత అనుభవం లేదు కానీ...తండ్రి సినిమాకు దర్శకత్వ శాఖలో పని చేయడానికి సిద్దం అయ్యాడు. అమీర్ ఖాన్, అనుష్క శర్మ జంటగా త్వరలో రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో ‘Peekay' అనే చిత్రం రూపొందబోతోంది. ఇందులో రాజ్ కుమార్ హిరానీకి ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా జునైద్ పని చేయనున్నాడు.

ఇప్పటి నుంచే సినిమా రంగంలోకి దింపడం వల్ల జునైద్‌కు అనుభవం వస్తుందని, భవిష్యత్‌లో హీరో అయ్యాక మంచి కథలను ఎంచుకునే నేర్పరి అవుతాడని అమీర్ ఆలోచన. అందుకే అతన్ని తొలుత దర్శకత్వ శాఖలోని ప్రవేశ పెట్టినట్లు తెలుస్తోంది. జునైద్‌కి నటన కంటే దర్వకత్వంలో ఎక్కువ ఇంట్రెస్టు ఉండటం కూడా ఇందుకు మరో కారణం అంటున్నారు.

ఇటీవల బాలీవుడ్ న్యూ కమర్ అర్జున్ కపూర్(బోనీ కపూర్ మొదటి భార్య కొడుకు) కూడా ఇదే మాదిరి మొదట దర్శకత్వ శాఖలో పని చేసే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు అదే దారిని పాలో అవుతున్నాడు జునైద్. ఎలాగు తండ్రి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈ రంగంలో రాణించడం అతనికి పెద్ద కష్టమేమీ కాదు.