5 జులై, 2012

ఆత్మహత్య (తనని తాను కాల్చేసుకుంది)!

ప్రపంచపు అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఆపిల్ ఐఫోన్ ఒకటి. ఈ డివైజ్ కోసం పరితపించే వారి సంఖ్య కోకొల్లలు. కానీ… ఈ వీడియో క్లిప్పింగ్ ఐఫోన్ ఆరాధికులను తీవ్రమైన అసంతృప్తికి లోనుచేస్తుంది. ఫైనిష్ పబ్ SK24 పోస్ట్ చేసిన సమాచారం ఆధారంగా….

17 సంవత్సరాల హెన్నీ హెల్‌మినిన్ ఎప్పటిలానే సోమవారం ఉదయం పనికి వెళుతున్నాడు.. ఆకస్మాత్తుగా తన ప్యాంట్ జేబులోని ఐఫోన్ నుంచి పొగలు రావటం ప్రారంభమైంది. 90 రోజుల వయసు కలిగిన ఆ ఐఫోన్ నుంచి క్రమంగా మంటలు రాజుకున్నాయి. అప్రమత్తమైన హెన్రీ డివైజ్‌ను తనకు దూరంగా విసిరేసాడు. అదృష్టవశాత్తూ అతనికి ఏవిధమైన గాయాలు కాలేదు. ఐఫోన్ ప్రమాదానికి గురయ్యే ముందు వరకు చలాకీగా పనిచేసిందిని ఉన్నట్లుండి ఏంజరిగిందో తనకు అర్థంకావటంలేదని హెన్రీ వాపోయాడు.

ఘటనా స్థలానికి దగ్గర్లో అమర్చిన సెక్యూరిటీ కెమరా ఈ దృశ్యాన్ని చిత్రీకరించింది. బ్యాటరీలో తలెత్తిన షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమై ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి నిర్థిష్టమైన కారణం తెలియాల్సి ఉంది.