3 జులై, 2012

'నరసింహ స్వామి'గా దగ్గుపాటి రానా


daggubati rana play narasimha swamy

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
త్వరలో వైజాగ్ కు షిప్ట్ కానున్న ఈ చిత్రం షూటింగ్ మేజర్ పార్ట్ పూర్తైంది. దగ్గుబాటి రానా హీరోగా, క్రిష్ దర్శకత్వంలో, సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'కృష్ణం వందే జగద్గురుమ్‌'. ఈ చిత్రంలో రానా క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుందంటున్నారు దర్సకుడు క్రిష్. ఆయన ఈ విషయమై మాట్లాడుతూ...''మనిషి డబ్బుతో పాటు నడుస్తున్నాడో, డబ్బే మనిషిని నడిపిస్తుందో అర్థంకాని పరిస్థితుల్లో ఉన్నాం. మా బీటెక్‌ బాబు ఎలా నడిచాడన్నది సస్పెన్స్‌. నొప్పింపక, తానొవ్వక నెగ్గుకొస్తుంటాడు. కథకీ, కృష్ణ తత్వానికీ ఉన్న సంబంధం ఆసక్తికరం'' అన్నారు.
 
అలాగే ...తప్పు మనం చేసినా, చేతికి మట్టి మాత్రం అంటుకోకూడదు. భుజం... భుజం రాసుకొన్నంత మాత్రాన స్నేహం ఉన్నట్టు కాదు. ఒక్కోసారి శత్రువు దగ్గరా స్నేహం నటించాలి. తిట్టినా పొగిడినట్టు ఉండాలి. కోత కోసినా నొప్పి తెలియకూడదు. ఈ రోజుల్లో ఇలా ఉంటేనే చెల్లుతుంది. ఇదే వర్తమాన సమాజంలో చెల్లుబాటవుతున్న సిద్ధాంతం. అయితే ఆ యువకుడు తీరు వేరు. కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన విషయాన్ని తన జీవితానికి అన్వయించుకొని ఏం సాధించాడో తెర మీదే చూడాలి అంటున్నారు క్రిష్‌.

ఇందులో రానా పేరు బాబు. చదివింది బీటెక్‌. అందుకే అన్నీ హైటెక్‌ తెలివి తేటలు. పుస్తకాల్లో చదివిన జ్ఞానం కంటే... జీవితాల్లోంచి గ్రహించిందే ఎక్కువ. ఎప్పటికయ్యది ప్రస్తుతం అప్పటికామాటలాడి... తప్పించుకొన్న శ్రీకృష్ణతత్వం బాగా అలవాటు చేసుకొన్నాడు. అదే అనుసరించాడు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా రానా సరసన చేస్తోంది. నయనతార పాత్ర పేరు దేవిక. ఆమె డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. ఈ పాత్ర చిత్రంలో కీలకమై నడుస్తుంది.