4 జులై, 2012

వాళ్ల రాజకీయాల వల్లే ఇదంతా : హీరో సిద్దార్థమన దేశంలో చదరపు కిలోమీటర్‌కు ఒక థియేటర్ ఉంది, కానీ వందల కొద్దీ చిన్న సినిమాలు విడుదలకు నోచుకోవడం లేదు, కొన్ని సినిమాలు విడుదలయినా ప్రేక్షకుల వరకు వెళ్ల ముందే తీసేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి కారణం పరిశ్రమలోని కొందరు బడా వ్యక్తులు చేస్తున్న రాజకీయాల వల్లనే అంటున్నా సిద్ధార్థ. కొందరు థియేటర్లను గుప్పిట్లో పెట్టుకుని చిన్న సినిమాలను చితికేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

‘లవ్ ఫెయిల్యూర్' చిత్రం ద్వారా నిర్మాతగా మారిన సిద్ధార్థ.....ఆ సినిమాను మార్కెట్ చేయడంలో చాలా కష్టపడ్డారు. తక్కువ బడ్జెట్ చిత్రమే కాబట్టి ఎలాగో అలా మొత్తానికి సినిమాకు పెట్టున పెట్టుబడి రావడంతో పాటు పిసరంత లాభం కూడా వచ్చింది. సరైన థియేటర్లు దొరికి ఉంటే సినిమా ఇంకా బాగా ఆడేదని చెప్పుకొచ్చారు.
సిద్ధార్థ ప్రస్తుతం నందినీరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యారు. బెల్లకొండ సురేష్ నిర్మించనున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్. దీంతో పాటు ఇంగ్లీష్‌లో ‘విండ్స్ ఆఫ్ చేంజ్', ఎన్‌హెచ్‌2 అనే తమిళ చిత్రంలో, మరో హిందీ చిత్రంలో నటిస్తున్నాడు.

మరో వైపు నిర్మాతగాను రాణించేందుకు చిన్న బడ్జెట్ చిత్రాలపై కన్నేశాడు. వీర్య దానం కథాంశంతో బాలీవుడ్‌లో రూపొందిన ‘వికీ డోనర్' చిత్రం రీమేక్‌ ప్లాన్స్‌‍లో ఉప్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తెలుగు, తమిళం రీమేక్ హక్కులను సిద్ధార్థం సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తాను ఇటీవల స్థాపించిన ‘ఇటాకి ఎంటర్ టైన్మెంట్స్' బేనర్ పై ఈచిత్రాన్ని నిర్మించే యోచనలో ఉన్నాడు సిద్ధార్థ.