10 జులై, 2012

పెళ్ళి పీటలెక్కుతున్న హీరోయిన్

రుక్మిణి, ఈశ్వర్, మంజీర, పెళ్ళికాని ప్రసాద్ వంటి చిత్రాల ద్వారా తెలుగుప్రేక్షకులను ఆకట్టుకున్న "శ్రీదేవి" త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ప్రముఖ తమిళ నటుడు విజయ్ కుమార్, నటి మంజుల దంపతుల చిన్న కుమార్తె అయిన శ్రీదేవికి ఈ నెల 18వ తేదీన వివాహం జరగనుంది. వరుడు రాహుల్‌ హైదరాబాద్‌ కు చెందిన ఓ సాఫ్ట్‌ వేర్ కంపెనీ అధినేత. 

ఇక ఇప్పటికే ఆమె అక్కలు వనిత, ప్రీతి కూడా కొన్ని సినిమాల్లో నటించి పెళ్ళిచేసుకుని సెటిలయ్యారు. ప్రస్తుతం శ్రీదేవి పెళ్లి కోసం షాపింగ్ చేస్తూ చెన్నైలో హడావిడిగా తిరుగుతోంది. ఇక పెళ్ళి తర్వాత సినిమాల్లో నటించే విషయమై అవకాశాలు వచ్చి మా ఆయన ఒప్పుకుంటే తప్పనిసరిగా నటిస్తాను అని చెప్తోంది. అలాగే మీరు కమర్షియల్ గా సక్సెస్ కాలేదు అంటే తనకలాంటి నెంబర్ గేమ్స్ మీద ఆసక్తి లేదని అయినా పెళ్ళి చేసుకుంటున్నా వదిలేయవచ్చు కదా అని మూతి తిప్పుతూ చెప్పింది.

1 వ్యాఖ్య:

అజ్ఞాత చెప్పారు...

avida ku pelli ayyi 2 years avutundi..'


meeru chala venaka vunnattu vunnaru