6 జులై, 2012

రొమ్ము వృద్ది శస్త్రచికిత్సతో ఎంతో బాధను అనుభవించా: టివి స్టార్
టివి స్టార్ అమీ చైల్డ్స్ ఇటీవల రొమ్ము వృద్ది శస్త్రచికిత్సను చేయించుకున్నారు. రొమ్ము వృద్ది శస్త్రచికిత్స పై తన అనుభవాలను ఓ ప్రముఖ వెబ్ సైట్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఈ క్రింది విధంగా పంచుకున్నారు. రొమ్ము వృద్ది శస్త్రచికిత్స తనకు ఎంతో థ్రిల్డ్ ఫీలింగ్ కలిగించిందని అన్నారు. చికిత్స్ చేస్తున్న సమయంలో నేను ఎంతో బాధకు గురైనప్పటికీ.. ఆ తర్వాత నా రొమ్ములను చూసుకుంటే చాలా ఆనందం వేసిందని పేర్కొంది.

అమీ చైల్డ్స్‌కు ఇది రెండవ రొమ్ము వృద్ది శస్త్రచికిత్స. మొదటి రొమ్ము వృద్ది శస్త్రచికిత్స తను 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే చేయించుకుంది. ఐతే ఇప్పుడు రెండవ సారి మీరు ఎందుకు శస్త్రచికిత్స చేయించుకున్నారని అడిగిన ప్రశ్నకు గాను అమీ చైల్డ్స్ ఇచ్చిన సమాధానం అందరిని ఆశ్చర్య పరిచింది. ఆ సమాధానం ఏమిటంటే నా రొమ్ములు క్రిందకు జారిపోవడం వల్లనే నేను ఈ రొమ్ము వృద్ది శస్త్రచికిత్స రెండవ సారి చేయించకున్నానని తెలిపింది. అమీ చైల్డ్స్ ఈ ఆపరేషన్‌ను బర్మింగ్హామ్‌ హాస్పిటల్‌లో చేయించుకున్నారు.

హాస్పిటల్ నుండి అమీ చైల్డ్స్ డిశ్సార్జి అయిన తర్వాత ఈ సారి జరిగిన ఆపరేషన్‌లో ఇంప్లాంట్లు కండరాల వెనుక ఉంచారని పేర్కొంది. దీంతో తొలిసారి ఆపరేషన్‌తో పోల్చితే ఎక్కువ బాధను అనుభవించాల్సిన వచ్చిందన్నారు. మొదట్లో నా రొమ్ములపై ఒక పెద్ద ఏనుగు కూర్చొని ఉన్నంత బాధ కలిగింది. చికిత్స పూర్తైన తర్వాత ఉపశమం కలిగిందన్నారు.