5 జులై, 2012

అల్లు అర్జున్...ఇద్దరి అమ్మాయిల ముద్దుల ప్రియుడు
అల్లు అర్జున్,పూరీ జగన్నాధ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ బండ్ల గణేష్ ఓ చిత్రం ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 20న బ్యాంకాక్ లో షూటింగ్ ప్రారంభమయ్యే ఈ చిత్రంలో కథ కేవలం ట్రీట్ మెంట్ బేసెడ్ గా నడుస్తుందిని సమాచారం. ఇందులో బన్ని సరసన ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. ఇద్దరు అమ్మాయిలతో అల్లు అర్జున్ చేసే అల్లరినే ప్రత్యేకంగా ఫన్ తో కలిసి పూరీ స్క్రిప్టు రెడీ చేసాడని ఫిల్మ్ నగర్ సమాచారం.

గతంలో సీనియర్ దర్సకులు కె.రాఘవేంద్రరావు ఈ తరహా చిత్రాలు రూపొందించి ఘన విజయం సాధించారు. దాదాపు పెద్ద హీరోలందరూ చేసిన ఈ ఫార్ములా ఈ మధ్య కాలంలో ఎవరూ టచ్ చేయటం లేదు. దాంతో పూరీ ఈ పాయింట్ నే తన దైన శైలిలో ట్రీట్ మెంట్ ఇచ్చి రెడీ చేసి,బన్ని కి వినిపించి డేట్స్ ఓకే చేయించుకున్నారు. అందులోనూ ఇప్పటివరకూ అల్లు అర్జున్ చేసిన సినిమాల్లో ఒక్కరే హీరోయిన్ గా ఉంటూ వచ్చారు. తొలిసారిగా అల్లు అర్జున్ సరసన ఇద్దరు హీరోయిన్స్ చేస్తున్నారు. ఈ సంవత్సరం చివరాఖరున అంటే డిసెంబర్ నెలలో ఈ చిత్రం విడుదల చేయాలని పూరీ జగన్నాధ్ పట్టుదలతో ఉన్నారు.

ఇక అల్లు అర్జున్,ఇలియానా కాంబినేషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న రొమాంటిక్ ఎంటర్టనర్ 'జులాయి' రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ పేరు రవి. అతని క్యారక్టేర్ డిఫెరెంట్ గా ఉంటుంది. అల్లు అర్జున్ నోటివెంట వచ్చే త్రివిక్రమ్ డైలాగ్స్ వల్ల థియేటర్లన్నీ విజిల్స్‌తో నిండిపోవడం ఖాయం. అల్లు అర్జున్ ఎనర్జీ, అబ్బురపరిచే ఆయన డాన్సులు ఈ సినిమాకు హైలైట్ కానున్నాయి అంటున్నారు చిత్ర సమర్పకులు దానయ్య. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని డీటీఎస్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ నెల 13న విడుదల చేయనున్నట్లు నిర్మాత కె.రాధాకృష్ణ సోమవారం ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.

అల్లు అర్జున్ క్యారెక్టర్ ప్రకారం ఏమిటంటే...చదరంగం అంటే ఏమిటి? ఎన్ని గడులు ఉంటాయి? ఏ పావుని ఎలా కదపాలి? ఇలాంటి విషయాలన్నీ తెలిసినవాడితో చదరంగం ఆడడం, అందులో గెలవడం సులభమే. అయితే ఇవేమి పట్టకుండా... తనకు తెలిసిన పద్ధతిలోనే ఆడతానని పట్టుబడితే అతన్ని ఓడించడం కష్టం. రవి అలాంటి కుర్రాడే. ప్రయాణంలో పది దారులు ఎదురుపడితే పదకొండో మార్గం ఎంచుకొంటాడు. అందరూ రిస్కూ అంటుంటే అందులోనే కిక్కు ఉందని నమ్ముతాడు. సులభంగా డబ్బు సంపాదించడానికి ఓ ఆట మొదలెట్టాడు. ఇంతకీ ఈ ఆటలో గెలిచాడో లేదో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు అల్లు అర్జున్‌.