10 జులై, 2012

ఎన్టీఆర్ కొత్త లుక్ చూసి కంగారు
కొడాలి నాని రాజకీయ వివాదంతో ఆయన మీడియా ముందుకు రావటంతో ఒక్కసారిగా ఆయన కొత్త లుక్ ప్రపంచానికి తెలిసింది. ఈ హెయిర్ లుక్ చూసిన వారు బాగుందంటున్నారు. అయితే ఎన్టీఆర్ ఒళ్లు చేసి కనపడటమే చాలా మందికి నచ్చటం లేదు. దాంతో ఎన్టీఆర్ తాజా చిత్రం బాద్షా లో అలాగే కనపడతాడా అని కంగారుపడుతున్నారు.

గతంలో రాఖీ సమయంలోనూ ఎన్టీఆర్ బాగా ఒళ్లు చేసి నటించారు. ఆ తర్వాత యమదొంగలో సన్నపడ్డా మళ్లీ మొన్న ఊసరవెల్లిలో బాగా ఒళ్లుతో కనపడ్డారు. అయితే పెళ్లైన కొత్త కాబట్టి కాస్త ఒళ్లు చేసాను అని,దమ్ములో తగ్గి కనపడతా అని మాట ఇచ్చారు. దాని ప్రకారం దమ్ములో స్లిమ్ గా కనపడ్డారు. కానీ ఇప్పుడు మళ్లీ ఒళ్లు చేయటంతో ఫ్యాన్స్ కాస్త స్లిమ్ అయితే ఆ హెయిర్ స్టైల్ కి తగ్గట్లు బాగుంటాడు అని అంటున్నారు. జూ.ఎన్టీఆర్ తన తాజా చిత్రం బాద్షా కోసం ప్రత్యేకమైన హెయిర్ స్టైల్ ని డిజైన్ చేసారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసేదాకా ఎన్టీఆర్ బయిటకు ఆ లుక్ తో కనపడరని అంతా భావించారు.

కానీ కొడాలి నాని రాజకీయ వివాదంతో ఆయన మీడియా ముందుకు రావటంతో ఒక్కసారిగా ఆయన కొత్త లుక్ ప్రపంచానికి రివిల్ అయిపోయింది. మొదటి షెడ్యూల్ ని దూకుడు తరహాలోనో ఫారిన్ షెడ్యూల్ తో అంటే ఇటిలీలో ప్రారంభించారు. తొలి షెడ్యూల్ ను ఏకధాటిగా 50 రోజుల పాటు ఇటలీలో ప్లాన్ చేశారు. అక్కడే రెండు పాటలు కాజల్,ఎన్టీఆర్ మధ్యన తీయనున్నారు. అలాగే ఎమ్.ఎస్ నారాయణ,కాజల్,వెన్నెల కిషోర్,ఎన్టీఆర్ మధ్యన కొన్ని ఎంటర్టైన్మెంట్ సీన్స్ ని తీస్తున్నారు. అంతేకాకుండా దూకుడు తరహాలో ఈ చిత్రంలోనూ బ్రహ్మానందం కీ రోల్ ప్లే చేస్తున్నారు.

ఇక ఈ విషయమై స్క్రిప్టు రైటర్ కోన వెంకట్ తన ట్విట్టర్ పేజీలో...ఈ సినిమాలో ఎన్టీఆర్ బ్రాండ్ న్యూ అవతార్ లో కనిపించనున్నాడు. ఎన్టీఆర్ అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే ఉంటారు అన్నారు. ఇక అందుకోసం ప్రత్యేకంగా ముంబై నుంచి మేకప్ స్పెషలిస్టులు వచ్చి మరీ ఎన్టీఆర్ ని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. అందుకోసం ప్రత్యేకమైన ఫోటో సెసన్స్ కూడా నడిచాయి. 

ఇక ఎన్టీఆర్ సైతం ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...సినిమా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది అన్నారు. శ్రీను వైట్ల,ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే జనం రకరకాలు అంచనాలు వేస్తున్నారు. వాటినన్నిటికీ అతీతంగా కథ,కథనం ఉంటాయి. పూర్తిగ మొదటినుంచి చివరి వరకూ పొట్ట పగిలేలా నవ్విస్తాము అన్నారు. గబ్బర్ సింగ్ తో సూపర్ హిట్ కొట్టిన గణేష్,దూకుడుతో సూపర్ హిట్ కొట్టిన శ్రీనువైట్ల కాంబినేష్ కాబట్టి తమకీ ఆ రేంజి హిట్ పడుతుందని ఎన్టీఆర్ పూర్తి నమ్మకంగా ఉన్నారు. ట్రేడ్ లో సైతం ఆ నమ్మకంతో హైప్ క్రియేట్ అవుతోంది.