12 జులై, 2012

చరణ్ ‘జంజీర్’లో ప్రియాంక చోప్రా పాట

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, బి-టౌన్ టాప్ హీరోయిన్ బేబీ ప్రియాంక చోప్రా జంటగా రూపొందుతున్న బాలీవుడ్ చిత్రం. ఈ చిత్రం ద్వారా రామ్ చరణ్ తేజ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం ఒక విశేషమైతే....ప్రియాంక చోప్రా ఈ చిత్రం ద్వారా తొలిసారి తన సింగింగ్ టాలెంట్ చూపించబోతోంది.

దర్శకుడు అపూర్వ లఖియా ఆమెతో ఈచిత్రంలో ఆమెతో ఓ పాట పాడించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదంతా చిత్రంపై హైప్ పెంచడానికే అని బాలీవుడ్ టాక్. దేవిశ్రీ ప్రసాద్ ఈచిత్రానికి సంగీతం అందించనున్నట్లు ప్రచారం జరుగుతున్నా...దేవిశ్రీ మాత్రం తాను ఈ త్రానికి సంగీతం అందించే విషయం ఇంకా ఖరారు కాలేదని అంటున్నారు.

ప్రస్తుతం జంజీర్ షూటింగు బ్యాంకాక్‌లో జరుగుతోంది. . రాంచరణ్ సరసన ప్రియాంకా చోప్రా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్, అర్జున్ రాంపాల్, మహీ గిల్ ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రాన్ని రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అమిత్ మెహ్రా నిర్మిస్తున్నాడు. పాత 'జంజీర్' దర్శకుడు ప్రకాశ్ మెహ్రా కుమారుడే ఈ అమిత్.

అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కలిసి నటించిన‘జంజీర్' 1974లో మే 11న విడుదలై అప్పట్లో సంచలన విజయం సాధించింది. ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆ రోజుల్లోనే దాదాపు 5 కోట్లు వసూలు చేసి అమితాబ్‌కు యాంగ్రీ యంగ్‌మెన్‌గా తిరుగులేని గుర్తింపుని తెచ్చిపెట్టింది. తాజా రీమేక్‌లో ఈ చిత్రంతో అమితాబ్ ఓ గెస్ట్ పాత్రలో కనిపించనున్నాడని బాలీవుడ్ సమాచారం.