2 జులై, 2012

టాలీవుడ్ చీడ పరుగులు దొరికారు... అరెస్ట్
పైరసీ రూపంలో తెలుగు సినీపరిశ్రమకు దాపురించిన చీడ పరుగులను స్ట్రింగ్ ఆపరేషన్లో పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఏపీ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు సురేష్ బాబు సోమవారం ఏర్పాటు చేసిన సమీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. ఏపి ఫిల్మ్ చాంబర్, ఎపి సి.ఐ.డి మరియు మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్వహించిన మొదటి పైరసీ ఆపరేషన్ విజయవంతం అయిందని, ఈ ఆపరేషన్లో చెన్నయ్‌కి చెంది రాజేంద్ర పువ్వాడి అనే వ్యక్తి అరెస్టు చేసినట్లు తెలిపారు. అతను ఇప్పటి వరకు హాఫ్ మిలియన్ పైరసీ డీవీడీలను మార్కెట్ చేశారని, దాని విలువ రూ. 4,09,28,015(USD $716,000) ఉంటుందని ఇన్వెస్టిగేషన్లో తేలిందన్నారు.

ఆ తర్వాత నిర్వహించి ఆపరేషన్లో హైదరాబాద్‌కు చెందిన కత్తుల చైతన్య, విజయవాడకు చెందిన ప్రణీత్ మోతమర్రిలను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరు ఇప్పటి వరకు అన్ని భాషల్లో కలిసి 1450 సినిమాలు పైరసీ చేశారని, వీరి వల్ల సినీ పరిశ్రమకు 209 మిలియన్ల మేర సినీ పరిశ్రమకు నష్టం వాటిల్లందని తెలిపారు.

ఈ ఆపరేషన్లో ఫిల్మ్ ఇండస్టీకి సహకరిస్తున్న సిఐడి ఆఫీసర్ ఉదయ భాస్కర్ రెడ్డికి తెలుగు సినీ పరిశ్రమ తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు సురేష్ బాబు వెల్లడించారు. అరెస్టయిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. ఇకపై ఎవరు పైరసీ చేసినా తమ ఆపరషన్లో చిక్కక తప్పదని హెచ్చరించారు.