12 జులై, 2012

బికినీ విత్ జెండా... హీరోయిన్‌ని చితకబాదిన జనం!

ఇటీవల ముంబైలో జరిగిన ఓ ఘటనలో జనం గెహ్నా వశిస్ట్ అనే బాలీవుడ్ నటిని చితకబాదారు. ఆమె చేసిన తప్పేంటో తెలుసా..? బికినీ వేసుకుని మూడు రంగుల జెండాతో ఫోటోలకు ఫోజులు ఇవ్వడమే. దీంతో జాతీయ జెండాను అవమానించావనే కోపంతో రెచ్చిపోయిన కొందరు ఆమెపై దాడి చేశారు. ఈ ఘటనలో గెహ్నా‍‌కు తీవ్రమైన గాయాలయ్యాయి.

ముంబై నుంచి వెలువడే డైలీ భాస్కర్ అనే పత్రికలోని కథనం ప్రకారం ఆమె బికినీతో పాటు భారత జాతీయ పతాకంతో దర్శనం ఇవ్వడాన్ని నేషనల్ ఫ్లాగ్‌కు జరిగిన అవమానంగా భావించి వారు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది పాల్గొన్నట్లు తెలుస్తోంది.

గతంలో మోడల్ మందిరా బేడీ వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా మూడు రంగులతో కూడిన జెండాను పోలిన సారీ ధరించి విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అప్పుడు దేశ వ్యాప్తంగా ఆమె చర్యను ఖండించారు. అప్పుడు గానీ మందిరా జనం మధ్యలోకి వస్తే పరిస్థితి ఇలానే ఉండేదేమో..!

1 వ్యాఖ్య:

SNKR చెప్పారు...

ఆ 25 మంది యువకులకూ పంద్రాగస్ట్ రోజు గ్యాలంటరీ అవార్డులు ప్రదానం చేయబడాలని ఆశించడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయుణ్ణి.

"ముఝె రంగ్‌దే బసంతీ చోలా ముఝె రంగ్‌దే.."

తైతక్కలాడిన బసంతికి రంగు పడిందన్న మాట! :))