25 జులై, 2012

రాజమౌళి ఆఫర్ పట్ల చిరంజీవి విముఖత?

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కోసం భారీ ఎత్తున గ్రౌండ్ వర్క్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన చిరు చేయబోయే ప్రతిష్టాత్మక సినిమా కావడంతో సినిమా సంచలనాత్మకంగా ఉండాలని, ఒక మెసేజ్ ఫుల్ గా, తన రాజకీయ కెరీర్ కి ప్లస్సయ్యేలా ఉండటంటో పాటు...అభిమానులకు కావాల్సిన కమర్షియల్ అంశాలు కూడా జోడించి ఈ చిత్రాన్ని రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

చిరంజీవి 150వ చిత్రానికి దర్శకుడు ఎవరు అని గత కొంత కాలంగా రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వీరిలో రాజమౌళి, వివి వినాయక్ పేర్లు బలంగా వినిపించాయి. అయితే ఇటీవల రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి లాంటి పెద్ద హీరోల చిత్రాలకు దర్శకత్వం వహించను, చిన్న హీరోలతోనే చేస్తా....కానీ చిరంజీవి కోరితే ఆయన 150వ చిత్రానికి స్క్రిప్టు అందిస్తానని బహిరంగ ప్రకటన చేశారు.

రాజమౌళి ఆ ప్రకటన చేసిన అనంతరం మీడియాలో రకరకాల ఊహాగానాలతో కూడిన వార్తలు వినిపించాయి. మగధీర సమయంలో మెగా కుటుంబం చేసిన కొన్ని చర్యల వల్ల ఆయనతో కసి రగిలి చిన్న హీరోలతో సినిమాలు తీస్తూ దర్శకుడిగా తన సత్తా నిరూపించుకుంటున్నారనే వార్తలు ప్రముఖంగా వినిపించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో హర్టయిన చిరంజీవి స్క్రిప్టు అందిస్తానని రాజమౌళి చేసిన ఆఫర్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించ కూడదని నిర్ణయించుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.

రాజమౌళికి అవకాశం ఇవ్వడం వల్ల ఆయనకు మనమే మరింత స్టార్ ఇమేజ్ తెచ్చిన వాళ్లం అవుతామని, రేపు సినిమా హిట్టయితే రాజమౌళి అందించిన స్క్కిప్టు వల్లనే అయిందని మీడియా కోడై కూస్తుంది....ఇది మెగాస్టార్ ఇమేజ్ పై ప్రభావం పడుతుందనే ఆలోచనలో మెగా వర్గం ఉందట.

కాగా...చిరంజీవి 150వ చిత్రానికి వివి వినాయక్ దర్శకుడుగా ఖరారైనట్లు స్పష్టం అవుతోంది. ఆయన చిత్రానికి పరుచూరి బ్రదర్స్ స్కిప్టు అందించే పనిలో ఉన్నారని, గతంలో చిరంజీవి హిట్ చిత్రాలకు అద్భుతమైన స్క్రిప్టు అందించిన అనుభవం ఉన్న వీళ్లు ఉండగా రాజమౌళి అవసరం లేదనే ఆలోచనలో చిరంజీవి ఉన్నాడట.

1 వ్యాఖ్య:

chanukya చెప్పారు...

చిరంజీవి, వాళ్ళ ఫామిలీ అందరూ గ్రేట్ !!!!!!చాలా లేక ఇంకా పొగడాలా??!!! ;)