7 జులై, 2012

పబ్లిక్‌లో అందరూ చూస్తుండగా ఏంటా పాడు పని..!
హాలీవుడ్ ప్రముఖ సింగర్ క్రిస్ మార్టిన్ పబ్లిక్‌లో అందరూ చూస్తుండగా.. తన భార్య స్టార్ హీరోయిన్ జేనిత్ పాల్ట్రో ని ముద్దు పెట్టుకోని తనకొక పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించాడు. వివరాల్లోకి వెళితే లాస్ ఏంజిల్స్‌లోని కోల్డ్ ప్లే గిగ్ మెగా ఈవెంట్‌లో అభిమానుల మధ్యలో ఉన్న తన భార్యను హాఠాత్తుగా దగ్గరకు తీసుకోని పెదవి ముద్దు చుంబించాడు. ఈ హాఠాత్ పరిణామానికి అక్కడున్న అభిమానులు ఒక్కసారి ఖంగుతిన్నారు. వీరిద్దరూ ఇటీవల కాలంలో పబ్లిక్‌లో కనిపించిన చక్కనైన దృశ్యం ఇదే కావడం విశేషం.

మియామిలో ఉన్న అమెరికన్ ఎయిర్ లైన్స్ ఎరినాలో ఉన్న ఈ ఈవెంట్‌ను నిర్వహించారు. స్టేజిపై తన బ్యాండ్‌తో కలిసి ఫెర్పామెన్స్‌ను ఇస్తున్న క్రిస్ మార్టిన్ స్టేజి క్రింద ఉన్న తన భార్య జేనిత్ పాల్ట్రో ముద్దు పెట్టి మరలా అంతే స్పీడ్‌లో స్టేటిపైకి వెళ్లి తన పాటను కంటిన్యూ చేశాడు. తన భార్య జేనిత్ పాల్ట్రో ఈ సంఘటనకు షాక్ అవ్వగా, ఆ తర్వాత స్టేజిపై క్రిస్ మార్టిన్ కాస్త ఇబ్బంది పడ్డాడు. సాధారణంగా వీరిద్దరూ వారి ప్రయివేట్ కార్యకలాపాలను చాలా సీక్రెట్‌గా ఉంచుతారు. మార్టిన్, జెన్నిత్ పాల్ట్రో ఇద్దరూ కూడా ప్రేమించి 2003వ సంవత్సరంలో పెళ్లి చేసుకొవడం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. మోసస్(5), యాపిల్(7).

స్వతహాగా సింగర్ అయిన మార్టిన్ తన జీవితంలో తండ్రి అయిన సందర్బంలో కలిగిన ఆనందాన్ని మరి ఎన్నడూ తాను అనుభవించలేదని అన్నారు. నిజంగా తండ్రి భాద్యతలను నన్ను మరింత ప్రభావితుణ్ణి చేశాయని అన్నారు. ఇక జేనిత్ పాల్ట్రో ఇటీవల కాలంలో ఓ మ్యూజికల్ కామెడీ డ్రామా 'గ్లీ' లో నటించడానికి ఒప్పుకున్నారు. ఈ మ్యూజికల్ కామెడీ డ్రామాలో విల్ తో డేట్ చేసేటటువంటి క్యారెక్టర్ లో జేనిత్ పాల్ట్రో కనిపించనున్నారు. జేనిత్ పాల్ట్రో ఇందులో టీచర్ కనిపించనున్నారు. జేనిత్ పాల్ట్రో ఇందులో రెండు ఎపిసోడ్స్ లో మాత్రమే పాల్గోంటారు.

1 వ్యాఖ్య:

epass చెప్పారు...

english people style