5 జులై, 2012

'కెమెరామెన్‌ గంగతో...'ఐటం గర్ల్ కి పూరి కాస్టలీ గిప్ట్
పూరీ జగన్నాధ్,పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు'. ఈ చిత్రం కోసం బ్రిటీష్ మోడల్ తో హాట్ ఐటం సాంగ్ ని రీసెంట్ గా సారధి స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో షూట్ చేసిన సంగతి తెలిసిందే . ఆ సాంగ్ తో పవన్‌తో కలిసి విదేశీ నర్తకి స్కార్లెట్‌ విల్సన్‌ ఆడిపాడింది. ఆమె డాన్స్ కు ముగ్దుడైన పూరీ చివరి రోజున ఓ కాస్ట్ లీ ఐ ఫోన్ 4S ని గిప్ట్ గా ఇచ్చారు. ఈ పాట సినిమాలో హైలెట్ అవనుందని సమాచారం.

ఇక శ్రీకాకుళం యాసలో హుషారుగా సాగే ఈ గీతాన్ని భాస్కరభట్ల రవికుమార్‌ రాశారు. లండన్‌కి చెందిన స్కార్లెట్‌ హిందీలో 'షాంఘై' అనే చిత్రంలో ఐటెమ్‌ గీతం చేసింది. ఇటీవలే రామ్‌చరణ్‌ చిత్రం 'ఎవడు'లోనూ నర్తించింది. ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు సమకూర్చారు. పవన్ సెన్సేషనల్ హిట్ చిత్రం గబ్బర్ సింగ్ లో కెవ్వు కేక ఐటం సాంగ్ నిజంగానే కెవ్వు కేక పెట్టించి సినిమా హిట్టులో మేజర్ షేర్ ని పొందింది. ఇప్పుడు అలాంటిదే ఈ ఐటం సాంగ్ అని చెప్తున్నారు.

తొలి కలయిక ‘బద్రి' తోనే సెన్సేషన్ సృష్టించిన పవన్‌కళ్యాణ్-పూరి జగన్నాథ్. ‘బద్రి' తర్వాత వాళ్లిద్దరూ మళ్లీ కలిసి సినిమా చేయలేదు. మళ్లీ ఇన్నాళ్లకు వాళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘కెమెరామేన్ గంగతో రాంబాబు'. ‘గబ్బర్‌సింగ్' లాంటి సూపర్ హిట్ తర్వాత పవన్‌కళ్యాణ్ నటిస్తున్న సినిమా ఇదే కావటంతో మరింత క్రేజ్ వచ్చింది.

ఇందులో పవర్‌స్టార్ జర్నలిస్ట్‌గా నటిస్తున్నారు. నేటి రాజకీయాలపై ఓ వ్యంగాస్త్రంగా ఈ చిత్రాన్ని పూరీ రూపొందిస్తున్నట్లు సమాచారం. తమన్నా ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. పవన్‌కళ్యాణ్,తమన్నా కలిసి నటిస్తున్న తొలి సినిమా కూడా ఇదే. అక్టోబర్ 18న గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ముందే పూరీ ప్రకటించారు.