14 జులై, 2012

అమీర్ ఖాన్ కాబోయే దేశ ప్రధానిఅమీర్ ఖాన్ నిర్వహిస్తున్న ‘సత్యమేవ జయతే' కార్యక్రమంపై ప్రముఖ బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ మాట్లాడుతూ...‘అమీక్ ఖాన్ వండర్ ఫుల్ జాబ్ చేస్తున్నాడు. అతను ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి నును సిద్ధంగా ఉన్నాను, నేను మాట్లాడేది..కామన్ మ్యాన్‌కి సహాయ పడే ఏపనైనా చేస్తానని. నా అభిప్రాయం ప్రకారం అమీర్ ఖాన్ రియల్ హీరో. రాబోయే రోజుల్లో ఆయన దేశ ప్రధాని అవుతాడనే నమ్మకం ఉంది' అని వ్యాఖ్యానించారు.

బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ నిర్వహిస్తున్న స్టార్ టీవీలో రియాల్టీ షో ‘సత్యమేవ జయతే' కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా మంచి స్పందన వస్తున్న సంగతి తెలిసిందే. భారతీయ సమాజం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను చర్చకుబెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఆ కార్యక్రమంలో ప్రస్తావించే సమస్యలు దేశంలో ఇప్పుడే కొత్తగా పుట్టుకొచ్చినవేమీ కాదు. ఎప్పటినుండో మనమధ్య నలుగుతున్నవే. ఎవరికివారు తమకెందుకులే అని పట్టించుకోలేదు. ఇప్పుడు వీటిని తమ కార్యక్రమంద్వారా ప్రసారం చేసి ప్రజలను, నాయకులను ఆ దిశగా ఆలోచింపజేయడంలో అమీర్ ఖాన్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

టివిని కాలక్షేపానికే ఉపయోగించే మన ప్రేక్షకులు గంటన్నర సేపు కొనసాగే సీరియస్ టాపిక్స్‌ను చూస్తారా అని మొదట సందేహం కలిగింది. కాని అమీర్‌ఖాన్‌కున్న ఆకర్షణ, కార్యక్రమ రూపకల్పన, ప్రెజెంటేషన్ ఆసక్తికరంగా వుండటంవల్ల ప్రేక్షకులు అందులో లీనమైపోతున్నారు...స్టార్ ఇమేజ్, డబ్బు సంపాదన కోసమే తప్ప మంచి పనులు చేయడానికి ఆసక్తి చూపని ఈ తరం స్టార్లకు అమీర్ ఖాన్ ఆదర్శనీయం.

3 వ్యాఖ్యలు:

స్వాతి చెప్పారు...

నాకు చాలా రోజుల నుండి ఒక డౌట్ ఉంది. ఈ ప్రోగ్రాం కు అమీర్ ఖాన్ తీసుకునే Remuneration ఎంత?

ఆత్రేయ చెప్పారు...

ప్రోగ్రాం బాగుంది
అమీర్ నటన కూడా బాగుంది
ఈ ప్రోగ్రాం మీద వచ్చిన డబ్బులు ఏమి చేస్తాడో తెలుసుకోవాలని ఉంది.
ఏది ఏమైనా ఇప్పరి రాజకీయ నాయకుల కన్నా అమిరే బెటర్ భావి ప్రధానిగా..

అజ్ఞాత చెప్పారు...

ఈ ప్రోగ్రాముకి అమీర్ ఖాన్ 3 కోట్లు తీసుకుంటున్నాడని చదివాను.
అయినా నిర్మాణసంస్థ ఆయనదే కాబట్టి లాభం, నష్టం ఆయనవే.
casting couch ఆరోపణలున్న శక్తికపూర్ మాటలు పట్టించుకోనక్కర్లేదు కాని అమీర్ మంచి సినిమాలు తీసిన, సమాజం పట్ల ఎంతోకొంత భాద్యత ఉన్న మంచి నటుడు.