5 జులై, 2012

‘సీతమ్మ వాకిట్లో...’ షూటింగులో ప్రమాదం
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం షూటింగులో గురువారం చిన్నపాటి ప్రమాద సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కర్నూలు జిల్లా అహోబిలంలో జరుగుతోంది. అయితే ఉన్నట్టుండి టెంట్ కూలి పోవడంతో పలువురు యూనిట్ సభ్యులకు స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం షూటింగ్ యదావిధిగా జరుగుతోంది. ప్రస్తుతం ఇక్కడ వెంకటేష్-అంజలిలపై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

వెంకటేష్, మహేష్ బాబు మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న ఈచిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ బాబుకు జంటగా సమంత, వెంకటేష్‌కు జంటగా అంజలి నటిస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీజే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు గతంలో ఈచిత్రం గురించి మాట్లాడుతూ....25 సంవత్సరాల తర్వాత వస్తున్న మల్టీస్టారర్‌ ఇది. వెంకీ, మహేష్‌ అన్నదమ్ము లుగా నటిస్తున్నారు. సీతమ్మ వాకిలి.. అంటే భారతదేశం, సిరిమల్లె చెట్టు..అంటే కుటుంబం. టైటిల్‌ మంచి ఫీల్‌నిచ్చింది.... 'ఆస్తిపాస్తుల ముందు అన్నదమ్ముల బంధాలకు ఈ రోజుల్లో విలువనివ్వడం లేదు' కానీ ఆస్తుల్నీ..అనుబంధాలను..ఆప్యాయితల్నీ పంచుకొనే సోదరులను చూడాలనుకుంటే మా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా చూడాలంటున్నారు.