4 జులై, 2012

ఆవిడ దెబ్బకు రవితేజ ‘బలుపు’ తుస్‌స్‌స్!గతంలో ‘ఇడియట్‌' లాంటి విచిత్రమైన టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్‌ మహారాజ రవితేజ.... త్వరలో ‘బలుపు' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. గోపీచంద్‌ మలినేని ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో డాన్‌ శ్రీను చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రసాద్‌ వి పొట్లూరి పివిపి సినిమా బేనర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించన్నారు.

ఈ చిత్రంతో రవితేజ బలుపును తన అందాలతో అణచడానికి సిద్ధం అవుతోంది హాట్ బ్యూటీ శృతి హాసన్. దర్శకుడు గోపీచంద్ మలినేని చెప్పిన స్క్రిప్టుకు శృతి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె రవితేజతో నటించనున్న విషయం దాదాపు ఖరారైనట్టైంది.

గబ్బర్ సింగ్ చిత్రం భారీ విజయంతో ఇపుడు పరిశ్రమలో అందరి హీరోల దృష్టి శృతి హాసన్ పైనే. ఆవిడ సినిమాలో చూపించి బొడ్డు అందాలకు బాగా మార్కులు పడటంతో....తమ సినిమాలోనూ ఆ అందాలను వాడేసుకోవడాలని దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.

రవితేజ విషయానికిస్తే... ఆయన నటించిన ‘దేవుడు చేసిన మనుషులు' ఈ నెలలోనే విడుదలకు సిద్ధం అవుతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్‌గా నటించింది. మరో వైపు రవితేజ ‘సార్ వస్తారా' చిత్రానికి కూడా కమిట్ అయ్యారు. వైజయంతి మూవీస్ పతాకంపై పరశురామ్ దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.