6 జులై, 2012

ఐమాక్స్‌లో ఆమెపై జరిగిన దారుణంపై...

సాంకేతికంగా ప్రపంచం రోజు రోజుకీ అభివృద్ధి చెందుతూనే ఉంది. దాని వల్ల ఎంతో మేలు జరుగుతోంది. అదే సమయంలో కొందరు స్వార్థ పరుల వల్ల వినాశనానికి కూడా దారి తీస్తోంది. అలాంటి కథాంశంతో ఎంతో ఉత్కంఠ భరితంగా రూపొందిన ఇంగ్లీష్ చిత్రం ‘ది ఫ్యాషన్'. విజువల్ రియాలిటీ సమర్పణలో ‘ఐమాక్స్ సుందరి' పేరుతో ఈచిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జులై ద్వితీయార్థంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం గురించి మాటల రచయిత శ్రీరామ్ వై. తెలియజేస్తూ ...‘ఒక మల్టీ ప్లెక్స్ కాంప్లెక్స్‌లో జరిగిన సంఘటన వల్ల ఓ అందమైన యువతి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది అనే ఇతి వృత్తంతో రూపొందిన ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకుల్లో టెన్షన్‌ని క్రియేట్ చేస్తుందన్నారు.

టెక్నాలజీని వాడుకుని మల్టీప్లెక్స్‌కి వచ్చే అమ్మాయిల్ని బ్లాక్ మెయిల్ చేస్తూ వారి దగ్గర నుంచి డబ్బు వసూలు చేయడమే పనిగా పెట్టుకున్న మల్టీప్లెక్స్ యజమానిని ఒక అమ్మాయి ఎలా ఎదుర్కొంది, అతని ఆట ఎలా కట్టించింది అనేది ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు. ఈ చిత్రంలోని ప్రతిసీన్ ప్రేక్షకులకు ఎంతో థ్రిల్ కలిగిస్తుందని తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకాదరణ పొందుతుందన్న నమ్మకం నాకు ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జులై ద్వితీర్థంలో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు.