2 జులై, 2012

అల్లు అరవింద్ సంస్ధ ద్వారా 'చారులత' రిలీజ్


ప్రియమణి ప్రస్తుతం 'చారులత'అనే హర్రర్ చిత్రంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ విడుదలకే మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ పంపిణీ సంస్ధ గీతా డిస్ట్ర్రిబ్యూటర్స్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. గీతా వారు తీసుకోగానే ట్రేడ్ లో ఈ చిత్రంపై మంచి ఆసక్తి కలిగింది. ఇక ఈ చిత్రంలో ప్రియమణి అవిభక్త కవలలుగా కనిపించి అలరించనుంది. ప్రియమణి చేస్తున్న ఈ రెండు పాత్రలులో ఆమె డిపెరెంట్ గా ఉండబోతోంది.

‘చారులత' చిత్రంలో ప్రియమణి ఈ కవలల పాత్ర చేస్తున్నారు. థాయ్ చిత్రం ‘అలోన్' ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పోన్‌కుమరన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రియమణి పాత్రల పేరు ‘చారు, లత'. చారు, లతల్లో ఒక యువతి దూకుడు.. మరో యువతి అమాయకురాలు. ఈ రెండు పాత్రలకు సంబంధించిన సన్నివేశాలను ఒకదాని తర్వాత ఒకటి చిత్రీకరిస్తున్నారు. తమిళ చిత్రం ‘పరుత్తివీరన్'తో ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ సాధించారు ప్రియమణి. ఆమెకు మరో జాతీయ అవార్డుని తెచ్చిపెట్టే చిత్రం ఇది అవుతుందనే అంచనాలు ఉన్నాయి.

మరి సినిమా మొత్తం చారు, లత అతుక్కునే ఉంటారా లేక శస్త్ర చికిత్స ద్వారా విడదీస్తారా? అనేది ప్రస్తుతానికి సీక్రెట్. చారు, లతల్లో ఒక యువతి దూకుడు.. మరో యువతి అమాయకురాలు. ఈ రెండు పాత్రలకు సంబంధించిన సన్నివేశాలను ఒకదాని తర్వాత ఒకటి చిత్రీకరిస్తున్నారు. ఒక సన్నివేశంలో దుడుకుగా, ఆ వెంటనే అమాయకంగా నటించడం అంత సులువు కాదని, దర్శకుడి సహకారంతో చేస్తున్నానని ప్రియమణి పేర్కొన్నారు. తమిళ చిత్రం ‘పరుత్తివీరన్'కి ఉత్తమ నటిగా ప్రియమణి జాతీయ అవార్డు అందుకున్నారు. ‘చారులత' మరో జాతీయ అవార్డు తెచ్చిపెట్టడం ఖాయం అని కన్నడరంగం వారు అంటున్నారు. మలి షెడ్యూల్‌ని బెంగళూరులో జరపడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రంలో సీత, శరణ్య, ఆర్తి తదితరులు నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే, కన్నడంలో పునీత్‌రాజ్‌కుమార్ సరసన ప్రియమణి నటించిన ‘అన్నాబాండ్' త్వరలో విడుదల కానుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ యాక్షన్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో కూడా ప్రియమణి మంచి పాత్ర చేశారు. ఈ ఏడాది హిందీలో కూడా మంచి అవకాశం సంపాదించుకున్నారామె. రాజీవ్‌వాలియా దర్శకత్వంలో గోవింద్‌శ్రీవాత్సవ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి హీరో ఎంపిక కావల్సి ఉంది. తెలుగులో త్వరలో ప్రియమణి ఓ సినిమాకి సైన్ చేయబోతున్నారు. మొత్తం మీద 2012 నాదే అని చెప్పుకోదగ్గ విధంగా ప్రియమణి ఖాతాలో మంచి సినిమాలు ఉన్నాయి.