4 జులై, 2012

ఎయిర్ పోర్టులో రవితేజ-కాజల్ రొమాన్స్
మాస్ మహరాజా రవితేజ, హాట్ హీరోయిన్ కాజల్ ప్రస్తుతం ‘సార్ వస్తారా' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ పతాకంపై పరశురామ్ దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.ఈచిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలోని ఎయిర్ పోర్టు సెట్ లో జరుగుతోంది. ఇద్దరిపై రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

ఈ చిత్రంలో మరో హీరోయిన్ రీచా గంగోపాధ్యాయ సెంకడ్ హీరోయిన్‌గా నటిస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ ముగిసన తర్వాత ఊటీలో ప్రకృతి అందాల మధ్య చిత్రీకరణ జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో రవితేజ-పరశురామ్ కాంబినేషన్లో ‘ఆంజనేయులు' అనే మూవీ వచ్చినప్పటికీ ఈ సారి మాత్రం సినిమా హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నారు అశ్వినీదత్.

మరో వైపు రవితేజ ‘బలుపు' అనే చిత్రానికి కూడా కమిట్ అయ్యారు. గోపీచంద్‌ మలినేని ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో డాన్‌ శ్రీను చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రసాద్‌ వి పొట్లూరి పివిపి సినిమా బేనర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించన్నారు. ఈచిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది.

మినిమమ్ హిట్ గ్యారంటీ హీరోగా ఉన్న రవితేజను ఈ మధ్య వరుసగా ప్లాపులు పలకరిస్తున్నాయి. రవితేజ నటించిన వీర, నిప్పు, దొంగల ముఠా, దరువు చిత్రాలు బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టాయి. తాజాగా రవితేజ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘దేవుడు చేసిన మనుషులు' చిత్రంలో ఈ నెలలోనే విడుదలకు సిద్ధం అవుతోంది.