11 జులై, 2012

భద్రాచలంలో సునీల్ మూవీ షూటింగ్

సునీల్‌, ఇషాచావ్లా కాంబినేషన్‌లో పూలరంగడు తర్వాత మళ్ళీ మరో చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. బాలీవుడ్ మూవీ ‘తను వెడ్స్ మను' చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ఈచిత్రాన్ని మెగా సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బేనర్‌పై ఎన్‌.వి. ప్రసాద్‌, పరాస్‌జైలు నిర్మిస్తున్నారు. దేవీప్రసాద్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ భద్రాచలంలో జరుగుతోంది. సునీల్ రామున్ని వేడుకునే సీన్లతో పాటు, ఇతర నటీనటులుపై పలు సీన్లు చిత్రీకరిస్తున్నారు. దర్శకుడు దేవి ప్రసాద్ గతంలో సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ బేనర్‌లో ‘నువ్వు వస్తావని' చిత్రానికి అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. సునీల్‌కు సూటయ్యేలా స్క్రిప్ట్‌ తయారు చేశారు. విజువల్స్‌ అద్భుతంగా ఉండాలని సమీర్‌ కెమెరామెన్‌గా ఎంపిక చేశారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఎక్కడా మిస్‌ కాకుండా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఈ చిత్రం గురించి నిర్మాత గతంలో ఓ సారి మాట్లాడుతూ... అందాలరాముడితో హీరోగా పరిచయం అయిన పూలరంగడు పెద్ద హిట్‌ కావడంతో సక్సెస్‌ హీరోగా పేరు పొందాడు. సునీల్‌నుంచి ప్రేక్షకులు ఏమి కోరుకుంటున్నారో అవన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. ఏప్రిల్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది అన్నారు. చౌదరి మాట్లాడుతూ.. సునీల్‌కు మా బేనర్‌లో రెండవ సినిమా. తనువెడ్స్‌ మను చిత్రానికి చిన్న మార్పులు చేసి రీమేక్‌ చేస్తున్నాం. సునీల్‌ కెరీర్‌లో మరో మంచి చిత్రమవుతుంది అన్నారు. త్వరలోనే ఈచిత్రం టైటిల్ ఖరారు కానుంది.