3 జులై, 2012

హాట్ భువనేశ్వరి నిజ జీవితంపై 'డర్టీ పిక్చర్'?

విద్యాబాలన్ ప్రధాన పాత్రలో వచ్చిన డర్టీపిక్చర్ ఘన విజయం చాలా మందికి ప్రేరణ ఇస్తోంది. తాజాగా ఆ లిస్ట్ లో భువనేశ్వరి చేరింది. ఆ మధ్య కాలంలో వ్యభిచారం కేసులో అరెస్టు అయిన భువనేశ్వరి గుర్తుండే ఉంటుంది. ఆమె ఇప్పుడు తన జీవిత కథను డర్టి ఫిక్చర్ తరహాలో తెరకెక్కించాలనే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. దాంతో ఆమె ఇప్పుడు పిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

అలాగే ఆ సినిమాను ఆమే స్వయంగా డైరక్ట్ చేయాలని, కథ పట్టుకుని నిర్మాతలు చుట్టూ తిగుతున్నట్లు తెలుస్తోంది. తన నిజ జీవితంలోని కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా కథ చేసుకున్నానని అవి తప్పకుండా సెన్సేషన్ క్రియేట్ చేస్తాయని ఆమె చెప్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. సిల్క్ స్మిత తరహాలో తన జీవితంలోనూ చీకటి కోణాలన్నాయని,తను ఇండస్ట్రీలో ఎలా ఇబ్బందులు పడిందో ఈ చిత్రంలో చూపించనున్నట్లు చెప్పుకుంటున్నారు.

అలాగే సెక్సీ లుక్స్‌తో వెండి తెరపై వ్యాంపు క్యారెక్టర్లు, టీవీ సీరియల్స్ లో విలన్ వేషాలు వేస్తూ రాణిస్తున్న నటి భువనేశ్వరి ఆ మధ్యన చీటింగ్ కేసులోనూ బుక్కయింది. భువనేశ్వరి చెన్నయ్ కి చెందిన ఓ ఫైనాన్సియర్ దగ్గర టీవీ సీరియల్ తీస్తానని రూ. 1.5 కోట్లు తీసుకుంది. సీరియల్ తీయక పోగా, డబ్బులు తిరిగి ఇవ్వడానికి మొరాయిస్తుండటంతో సదరు ఫైనాన్సియర్ చెన్నయ్ కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు మళ్లీ సినిమా అనటంతో అందరూ ఆలోచనలో పడుతున్నారు.

భువనేశ్వరి గతంలో వ్యబిచారం కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆమెపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. కళాకారుల పరువు తీసే చర్చ చేసినందుకు ఆమెపై కొన్ని సినీ పరిశ్రమల్లో నిషేదం కూడా విధించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా భువనేశ్వరి సినిమా తీస్తానంటూండటంతో సర్వత్రా చర్చనీయాంశం అయింది.