15 జులై, 2012

ప్రభుదేవాకు పోటీగా నయనతార సైతం డైరక్షన్

నయనతార త్వరలో డైరక్షన్ చేస్తుంది అంటోంది తమిళ మీడియా. దానికి కారణం ఆమె ప్రస్తుతం దర్శకత్వ పాఠాలు నేర్చుకోవటానికి గానూ దర్శకుడు విష్ణు వర్ధన్ దగ్గర అసోసియేట్ గా చేరటమే. అజిత్ తో చేస్తున్న చిత్రానికి ఆమె అసోసియేట్ డైరక్టర్ గా వ్యవరిస్తోంది. కాబట్టి త్వరలో ఆమె మెగాఫోన్‌ పట్టుకొని స్టార్ట్‌ కెమెరా యాక్షన్‌ చెబుతుంది అని అంటున్నారు. ప్రభదేవాకు పోటీగా ఆమెసైతం డైరక్షన్ చేస్తుంది అంటున్నారు.

అజిత్‌, నయనతార జంటగా ఓ తమిళ చిత్రం తెరకెక్కుతోంది. విష్ణువర్థన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె కేవలం కథానాయిక మాత్రమే కాదు. సహాయ దర్శకురాలిగానూ పని చేయబోతోంది. విష్ణువర్ధన్‌ దగ్గర దర్శకత్వ పాఠాలు నేర్చుకొంటోంది. స్క్రిప్టు రూపకల్పన, సన్నివేశాల చిత్రీకరణ విధానాలపై ప్రత్యేక దృష్టిపెడుతున్నట్లు చెన్నై సినీ వర్గాలు చెబుతున్నాయి. తను చేసే చిత్రాల దర్శకుల దగ్గర మెళకువలు తెలుసుకొని కెప్టెన్‌ కుర్చీలో కూర్చొంటుందేమో భవిష్యత్ నిర్ణయిస్తుంది అంటున్నారు.

ప్రస్తుతం నయనతార తెలుగులో నాగార్జున,దశరధ్ కాంబినేషన్ లో ఓ చిత్రం కమిటైంది. అదికాక క్రిష్ దర్శకత్వంలో రానా హీరోగా రూపొందుతున్న కృష్ణం వందే జగద్గురంలోనూ ఆమె హీరోయిన్ గా చేస్తోంది. మరో రెండు తమిళ సినిమాలు సైతం ఆమె కమిటైంది. బాలకృష్ణ కూడా తను డైరక్ట్ చేద్దామనుకున్న నర్తన శాలలో ఆమెను హీరోయిన్ గా అడుగుతున్నాడు.