3 జులై, 2012

రామ్ చరణ్ సినిమా ఖరారు కాలేదు: దేవిశ్రీప్రసాద్రామ్ చరణ్ తాజాగా చేస్తున్న హిందీ రీమేక్ జంజీర్ కి ప్రముఖ దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన మాట్లాడుతూ...ఇంకా జంజీర్ విషయం ఇప్పటికి ఏమీ ఖరారు కాలేదు అన్నారు. అలాగే తనను హిందీ చిత్ర పరిశ్రమలో సల్మాన్ బాగా ప్రోత్సహిస్తారని,తన పాటలు విని ఫోన్ చేస్తూంటారని తెలిపారు.

సల్మాన్ విషయం మాట్లాడుతూ... రెడీ ఆడియో లాంచ్ లో నన్ను ఆయన హగ్ చేసుకుని మెచ్చుకున్న విషయం
నాకింకా గుర్తుంది. ఆయన తన బాడీగార్డ్ సినిమా కోసం కూడా మరెన్ని పాటలు చేయమన్నారు. కానీ టైమ్ కుదరక చేయలేకపోయాను. ఇప్పటికీ ఆయన నా పాటలు విడుదల అయినప్పుడు వాటిని విని,కాల్ చేసి ఎంకరేజ్ చేస్తూంటారు. ఆయన నా సంగీతాన్ని చాలా ఇష్టపడతారు అన్నారు.

ఇక జంజీర్ విషయానికి వస్తే..గతంలో 'ముంబై సే ఆయా మేరా దోస్త్', 'ఏక్ అజ్‌నబీ', 'షూటవుట్ ఎట్ లోఖండ్‌వాలా' చిత్రాల్ని రూపొందించిన అపూర్వ లఖియా ఈ రీమేక్ కి దర్శకుడు. 1973లో సూపర్ హిట్ అయిన అమితాబ్ బచ్చన్ సినిమా 'జంజీర్'కు ఇది రీమేక్. రాంచరణ్ సరసన ప్రియాంకా చోప్రా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్, అర్జున్ రాంపాల్, మహీ గిల్ ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రాన్ని రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అమిత్ మెహ్రా నిర్మిస్తున్నాడు. పాత 'జంజీర్' దర్శకుడు ప్రకాశ్ మెహ్రా కుమారుడే ఈ అమిత్. తన తండ్రి సాధించిన విజయాన్ని ఈ చిత్రంతో కొనసాగించలనుకుంటున్నాని చెప్తున్నాడు.

ఈ చిత్రంలో అమితాబ్ ఓ గెస్ట్ పాత్రలో కనిపించనున్నాడని బాలీవుడ్ సమాచారం. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అమిత్‌ మెహ్రా నిర్మాత. ఈ రీమేక్‌లో అమితాబ్‌ అతిథి పాత్రలో కనపడటానికి అమితాబ్ ఆసక్తి చూపిస్తున్నాడని బాలీవుడ్‌ సమాచారం. ఈ విషయమై దర్శకుడు అపూర్వ లఖియా ని మీడియా సంప్రదించింది. ఆయన మాట్లాడుతూ ''అమితాబ్‌ మా సినిమాలో నటిస్తున్నారని ఇంకా అధికారికంగా చెప్పలేను. ఆయన్ని సంప్రదిస్తున్న మాట వాస్తవమే. బిగ్‌ బి ఆశీస్సులు లేకుండా ఈ సినిమాను తీయలేం'' అన్నారు.