5 జులై, 2012

అజిత్ ‘డేవిడ్ బిల్లా’గూగుల్ రికార్డుఅజిత్ తాజా చిత్రం ‘డేవిడ్ బిల్లా'మరో రికార్డుని క్రియేట్ చేసింది. గూగుల్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన ట్రైలర్ గా ఈ చిత్రం నమోదు చేసింది. ఈ విషయం తెలిసిన అజిత్ ఫ్యాన్స్ ఉత్సవం జరుపుకుంటున్నారు. అలాగే ఈ చిత్రం పదమూడు ప్రెంచ్ సిటీలలో రిలీజవుతూ మరో రికార్డుని సైతం క్రియేట్ చేసింది. ఇలా ప్రెంచ్ సబ్ టైటిల్స్ ఇంత భారీగా రిలీజవుతున్న తొలి ఇండియన్ సినిమా ఇదే కావటం విశేషం. అలాగే భారతీయ సినీ చరిత్రలోనే బిల్లా 2 చిత్రం తొలి ప్రీక్వెల్ చిత్రంగా రికార్డు సృష్టించింది.అజిత్‌ని స్టయిలిష్‌గా ఆవిష్కరించిన చిత్రం ‘బిల్లా' చిత్రానికి ప్రీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదల అవుతోంది.

ఈ చిత్రం త్వరలో తెలుగులోకి డబ్ ఇక్కడ కూడా విడుదల కానున్న సంగతి తెలిసిందే. అందులోనూ ఈ చిత్రం సీక్వెల్ కాకుండా బిల్లాకు ప్రీక్వెల్ కావటంతో మరింత ఆసక్తి పెరిగింది. ఇక ఈ చిత్రం కథ...బిల్లా మాఫియా లీడర్ అవ్వకముందు ఏం చేసేవాడు? అతను మాఫియాలోకి ఎంటరవ్వడానికి కారణం ఏంటి? అసలు బిల్లాగా అతను ఎలా రూపొందాడు. అంత పరవ్ శక్తిగా ఎలా మారి ప్రపంచానికి సవాళ్లు విసిరాడు...వంటి అనేక విషయాలు ఈ చిత్రంలో చర్చకు రానున్నాయి. ఇవన్నీ ఫ్లాష్‌బ్యాక్ లో రానుందని తెలుస్తోంది.

ఈ చిత్రం కథని దర్శకుడు చక్రి తోలేటి వివరిస్తూ..ఓ కుర్రాడు అనాథగా రోడ్డుపైకి వచ్చాడు. ఆకలితో అలమటించాడు. ఎవరూ ఆదరించలేదు. అంతే ఎదురు తిరిగాడు, దోచుకొన్నాడు. అప్పుడు తీరింది ఆకలి. ఆ బాటలోనే వెళ్తూ నియంతలా ఎదిగాడు. ప్రపంచాన్నే శాసించాడు. ఆ ప్రయాణంలో ఏం సాధించాడు? ఏం కోల్పోయాడో 'డేవిడ్‌ బిల్లా'లో చూడండి అన్నారు. పార్వతీ ఓమనకుట్టన్‌, బ్రూనా అబ్దుల్లా హీరోయిన్స్ చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

తెలుగులో ఈ చిత్రం ప్రదర్శన హక్కులు పొందిన శోభ మాట్లాడుతూ ''ప్రభాస్‌ నటించిన 'బిల్లా' చిత్రానికి ముందు భాగం ఈ చిత్రం. ఇందులో డేవిడ్‌ ఎవరు? అనేది కీలకం. అజిత్‌ నటన ఆకట్టుకొంటుంది. .అజిత్ కెరియర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో అజిత్ రిస్కీ ఫైట్లు చేశారు. 

ఈ ఫైట్స్ ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేసే విధంగా ఉంటాయి. ‘బిల్లా'లో అజిత్ స్టయిలిష్‌గా కనిపించారు. ఈ చిత్రంలో ఆయన మరింత స్టయిలిష్‌గా కనిపిస్తారు. ఈ చిత్రం కోసం ఉక్రెయిన్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు'' అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఆర్‌.డి.రాజశేఖర్‌,
సంగీతం: యువన్‌శంకర్‌ రాజా.