17 జులై, 2012

మంచు మనోజ్ గొడవలోకి త్రిషనూ లాగారు
మంచు మనోజ్ పై తనను ధూషించాడంటూ తమిళ నటుడు మహత్ రాఘవేంద్ర కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే. ఫిల్మ్ ఫేర్ అవార్డుల పంక్షన్ తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే తాప్సీ వలనే ఈ గొడవ మొదలైందంటూ ప్రచారం జరిగింది. తాప్సీ గురించి ఇద్దరూ హీరోలు ఫైట్ చేసుకుని,పోలీలుసులు దాకా వెళ్లారనటం,దానికి తాప్సీ నన్ను ఇందులోకి లాగద్దు అని ప్రకటన చేయటం జరిగింది. అయితే తాజాగా ఈ వివాదంలోకి త్రిష కూడా వచ్చి చేరింది. ఆ గొడవ జరగిన రోజు త్రిష అక్కడ విట్నెస్ గా ఉందని తమిళ మీడియా అంటోంది.

దాంతో త్వరలోనే త్రిషను సైతం పోలీసులు ఈ విషయమై సంప్రదించి ఎంక్వైరీ చేయనున్నారని తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంతో కానీ త్రిష మాత్రం తనను లాగుతున్నందుకు మండిపడుతున్నట్లు సమాచారం. ఇక మనోజ్ పై చెన్నై పోలీస్ స్టేషన్ లో నమోదు చేసిన ఎప్.ఐ.ఆర్ ప్రకారం...మహత్ రాఘవేంద్ర తాను తన ప్రెండ్ తో కలిసి ప్రేవేట్ గా మాట్లాడుకుంటూంటే వచ్చి కొట్టడం ప్రారంభించారు. కారణమేమిటో చెప్పకుండా మనోజ్ ఆయన ముగ్గురు స్నేహితులు నన్ను కొట్టారు. నా మొహం పై ,నా పొట్టపై వారు తీవ్రంగా కొట్టారు. అక్కడున్న ఎవరూ కూడా మా మధ్యకి వచ్చి నన్ను సేవ్ చేయాలని చూడలేదు.

కాస్సేపటికి అందరూ పోగవగా కొట్టడం ఆపి నా చావు అతని చేతిలోనే ఉందని వార్నింగ్ ఇచ్చి వార్నింగ్ ఇచ్చారు. తనకు ప్రాణ రక్షణ కల్పించవల్సిందిగా ఆ ఎఫ్.ఐ.ఆర్ లో మహత్ రాసారు. ఇక చెన్నై మీడియా సమాచారం ప్రకారం తాప్సీ విషయమై ఈ విభేదాలు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. తాప్సీ,మహత్ గత కొద్ది రోజులుగా డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. దాంతో మంచు మనోజ్ మండిపడ్డాడని తమిళ మీడియా రాసుకొచ్చింది. తాప్సీ,మంచు మనోజ్ తొలిసారిగా ఝుమ్మంది నాదం చిత్రంలో నటించారు. తాప్సీ తొలి చిత్రం అదే. సినిమా ఆడకపోయినా ఆమె ఆఫర్స్ కు మాత్రం లోటు లేదు.

ప్రస్తుతం మంచు మనోజ్...ఊ కొడతారా ఉలిక్కి పడతారా అనే చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సెకండాఫ్ ప్లాష్ బ్యాక్ లో వచ్చే పాత్ర. ఉండేది కొద్ది సేపే అయినా పెదరాయుడులో రజనీకాంత్ లాగ అదరకొడతాడని చెప్తున్నారు. దాంతో బిజినెస్ కూడా బాగా స్పీడుగా జరుగుతోందని వినికిడి. ఇక మంచు మనోజ్ సినిమాలు వరసగా భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అవుతూ వస్తున్నాయి. ఈ నేఫధ్యంలో ఈ కొత్త చిత్రానికి ఎంత వరకూ ఓపినింగ్స్ వస్తాయనేది సందేహమే. అయితే ఇక్కడే బాలకృష్ణ ఆదుకుంటాడు. ఆయన సినిమా గా భావించిన నందమూరి ప్యాన్స్ ఈ సినిమాకు మంచి ఓపినింగ్స్ ఇస్తారని,అదే స్టాటజీ అని చెప్పుకుంటున్నారు. మరో ప్రక్క ఈ చిత్రం ట్రైలర్ కూడా అందరిలో ఆసక్తి రేపుతోంది.