12 జులై, 2012

పవన్‌తో పాటు ఫ్యాన్స్ నటించే ఛాన్స్ : పూరి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు ఒక శుభ వార్త. తమ అభిమాన హీరోలతో కలిసి నటించే అవకాశం. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు....‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న పూరి జగన్నాథ్. ఈ చిత్రంలో కొన్ని కీలక సన్నివేశాల్లో పవన్‌తో నటించే అవకాశం అభిమానులకు కల్పిస్తామన్నారు.

‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలో క్లైమాక్స్ సీన్‌‍లో పవన్‌ వెంట చాలా మంది నడిచే కీలక సన్నివేశాలు చిత్రీకరించాలి. ఆ సీన్ కోసం అభిమానులు అయితే వారి కోరిక తీర్చినట్లు ఉంటుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. త్వరలోనే అభిమానులను గ్యాదర్ చేయడానికి ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో సెలక్షన్స్ నిర్వహిస్తాం. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు.

చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోందని, పవన్ యక్టింగ్ అమేజింగ్ అని పూరి చెప్పకొచ్చారు. తప్పకుండా ఈచిత్రం పూర్తి విందులా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే అంశాలు ఈచిత్రంలో ఉన్నాయి అంటున్నారు పూరి. ఈచిత్రంలో పవన్ సరసన తమన్నా హీరోయిన్‌గా చేస్తోంది. పవర్ స్టార్ ఇందులో మెకానిక్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

యూనివర్సల్ మీడియా పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈచిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈచిత్రం షూటింగు హైదరాబాద్లో జరుగుతోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 18న విడుదల చేయడానికి పక్కా ప్లాన్‌తో పూరి షూటింగ్ త్వరిత గతిన కానిస్తున్నాడు. ఈచిత్రంలో బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యాం కె.నాయుడు, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, నిర్మాత: డి.వి.వి.దానయ్య, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పూరీ జగన్నాథ్.