11 జులై, 2012

హాట్ లేడీకి... వ్యతిరేకంగా శ్రీరామ్ సేన ఆందోళన
విద్యాబాలన్ నటించిన ‘ది డర్టీ పిక్చర్' కలెక్షన్స్ బాలీవుడ్ బాక్సాఫీస్‌ని షాక్ అయ్యేలా చేసిన సంగతి తెలిసిందే. సిల్స్ స్మిత జీవతం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం కన్నడలో రీమేక్ అవుతోంది. పాకిస్దాన్ శృంగార నటి వీణా మాలిక్ నటిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ సినిమా పేరు 'డర్టీ పిక్చర్‌.. సిల్క్‌ సకత్‌హాట్‌మగ'.

వీణా మాలిక్... ఈ పేరు వింటేనే ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర లేదు. టాప్‌లెస్, న్యూడ్ ఫోటో ఫోజులతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న పాకిస్థాన్ నటి. న్యూడ్ ఫోజులు ఇచ్చినందుకు పాకిస్థాన్ నుంచి ఎన్నో రకాలైన బెదిరింపులు వచ్చినప్పటికీ.. ఏమాత్రం బెదరక.. తన పంథాలో ముందుకు సాగుతున్న ముద్దుగుమ్మ వీణా మాలిక్.

తాజాగా ఈ భామ కన్నడిగుల ఆగ్రహాన్ని చవి చూస్తోంది. కర్నాటకలోని శ్రీరామ్ సేన అనే హిందూ సంస్థ వీణామాలిక్‌తో ఈ చిత్రం చేస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ల నిరసన డర్టీ పిక్చర్ తీస్తున్నందుకు కాదు. వీణామాలిక్‌తో నటింపజేయడంపైనే. కొంత కాలంగా పబ్లిసిటీ కోసం వీణా మాలిక్ చేస్తున్న చర్యలు శ్రీరామ్ సేనకు రుచించడం లేదు.

దీంతో ఆమెకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు, పోస్టర్లు అంటించే కార్యక్రమాలు గట్రా చేస్తున్నారు. కాదని ఆమెతోనే సినిమా చేస్తామంటూ సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటామని నిర్మాతలను హెచ్చరించారు. ఆ సంస్థ అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ మాట్లాడుతూ...ఇండియాలో ఎంతో మంది టాలెంటెడ్ యాక్టర్స్ ఉండగా పాకిస్థానీ భామ వీణామాలిక్‌ను తీసు కోవడం ఏమిటని మండి పడుతున్నారు.

ఆ విషయం పక్కన పెడితే...ఇటీవల కర్నాటకలోని ఆమెపై కొన్ని సీన్లు చిత్రీకరించారు. షూటింగ్ రోడ్డుపైనే జరుగుతుండటంతో ఆమెను చూసేందుకు భారీగా జనం గుమి కూడారు. దీంతో ఉబ్బితబ్బిబ్బయిన వీణా తనకు ఇంత మంది అభిమానులు ఉన్నారా? అంటూ సంబర పడిపోయింది.