2 జులై, 2012

నన్ను రేప్ చేయబోయారు: కాంగ్రెస్ ఎమ్మెల్యే రుమీనాథ్
గుహవతి: తనపై దాడి చేసిన వ్యక్తులు అత్యాచారానికి కూడా యత్నించారని రెండో పెళ్లి చేసుకున్న ఎమ్మెల్యే రుమీనాథ్ ఆదివారంఆరోపించారు. దాడి చేసినవారు తనను చంపడానికీ ప్రయత్నించారని ఆమె పేర్కొన్నారు. అసోం రాష్ట్రంలోని బొర్ఖోలా నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే రుమీనాథ్. ఆమెకు భర్త, రెండు నెలల కూతురు ఉన్నప్పటికీ.. వారిని వదిలేసి ఫేస్‌బుక్‌లో పరిచయమైన స్నేహితుడు హుస్సేన్‌ను పెళ్లి చేసుకుంది.

తనకన్నా ఐదేళ్లు చిన్నవాడైన హుస్సేన్‌ను పెళ్లి చేసుకోవడం కోసం ఆమె మతం కూడా మార్చుకుని ఇస్లాం స్వీకరించింది. అయితే, దీనిపై ఆగ్రహించిన ప్రజలు.. దాదాపు 200 మంది ఇక్కడి కరీంగంజ్ పట్టణంలో శుక్రవారం రాత్రి ఆమెపై, ఆమె రెండో భర్తపై దాడి చేసి చితకబాదారు. పోలీసుల సాయంతో అక్కడి నుంచి బయటపడిన రుమీ నాథ్.. ఆదివారం తాజాగా ఆరోపణలు చేశారు.

దాడి చేసినవారు తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించారని, తనను చంపాలనీ చూశారని, దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని, దాడికి పాల్పడినవారెవరూ తనకు తెలియదని, వారెందుకు ఈ దాడికి పాల్పడ్డారో తెలియాల్సి ఉందని రుమీ నాథ్ చెప్పారు. కాగా.. ఈ దాడి ఘటనతో సంబంధమున్న ఐదుగురిని అసోం పోలీసులు అరెస్టు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కరీంగంజ్ పట్టణంలో 144 సెక్షన్ విధించారు.
కాంగ్రెసు శానససభ్యురాలు రూమీ నాథ్, ఆమె రెండో భర్తపై ఓ గుంపు శుక్రవారం రాత్రి దాడి చేసి కొట్టింది. 

అస్సాంలోని కరీంగంజ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుందని పోలీసులు శనివారం చెప్పారు. మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండా రూమీ నాథ్ రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటనలో వారిద్దరికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. కరీంగంజ్‌లోని ఓ హోటల్లో రాత్రి పొద్దుపోయేంత వరకు ఉన్న రూమీ నాథ్‌ను, రెండో భర్తను దాదాపు 200 మంది గుమికూడి కొట్టినట్లు పోలీసు సూపరింటిండెంట్ ప్రదీప్ పూజారి చెప్పారు. గత నెలలో రూమీనాథ్ రెండో పెళ్లి చేసుకున్నందుకు ప్రజలు ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు. రూమీనాథ్ గర్భవతి. ఈ ఘటనలో రూమీ నాథ్, రెండో భర్త తీవ్రంగా గాయపడినట్లు, రక్తమోడినట్లు, గుంపు నుంచి వారిని పోలీసులు రక్షించినట్లు చెబుతున్నారు.

చికిత్స అనంతరం ఎస్కార్టు సాయంతో వారిద్దరిని పోలీసులు రాష్ట్ర రాజధాని గౌహతికి పంపించి వేశారు. బరాక్ లోయలోని బోర్ఖోలా నియోజకవర్గానికి నాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండానే తాను జకీర్‌ను పెళ్లి చేసుకుంటున్నట్లు రూమీ నాథ్ ప్రకటించినప్పటి నుంచి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదటి భర్త రాకేష్ సింగ్ తన భార్య రెండు నెలల నుంచి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాకేష్ సింగ్, రూమీలకు రెండేళ్ల కూతురు ఉంది. రూమీనాథ్ 2006లో బిజెపి తరఫున పోటీ చేసి బోర్ఖోలా నుంచి మొదటిసారి శానససభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెసులో చేరారు. రెండోసారి ఆమె 2011లో శానససభకు ఎన్నికయ్యారు.