1 జులై, 2012

అందమైన జీవితానికి ముగింపు పలికిన సూపర్ స్టార్లాస్ ఏంజిల్స్, జూన్ 1: హాలీవుడ్ సూపర్ స్టార్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న టామ్ క్రూయిజ్‌పై తన అందాల భార్య స్టార్ హీరోయిన్ క్యాట్ హాల్మస్, టామ్ నుండి విడాకులు కావాలంటూ న్యూయార్క్‌లో కేసు ఫైల్ చేసింది. దీనికి కారణం వీరిద్దరి మధ్య వచ్చిన మనస్పర్దలేనని నిపుణులు భావిస్తున్నారు. టామ్ క్రూయిజ్, క్యాటీ హాల్మస్‌ జంటకు ఆరు సంవత్సరాల వయసు కలిగిన 'సూరి క్రూయిజ్' అనే పాప ఉంది. టామ్ క్రూయిజ్ నుండి విడాకుల లభించిన తర్వాత సూరి క్రూయిజ్ సంరక్షణా బాధ్యతలునిమిత్తం క్యాటీ హాల్మస్‌కు భారీ మొత్తం($15 మిలియన్)లో సొమ్ము చెల్లిస్తాడని హాలీవుడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

2006వ సంవత్సరంలో క్యాట్ హాల్మస్‌ను టామ్ క్రూయిజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. క్యాట్ హాల్మస్‌కు ఇదే మొదటి వివాహం కాగా, టామ్ క్రూయజి్‌కు మూడవ వివాహం. టామా క్రూయిజ్ గతంలో హాలీవుడ్ స్టార్ హీరోయిన్లు మిమి రోజెర్స్, నికోల్ కిడ్‌మన్‌లను వివాహం చేసుకున్నాడు. నికోల్ కిడ్ మన్‌లతో కలిసి ఉన్నప్పుడు టామ్ క్రూయిజ్ ఇసాబెల్లా జానే, కానర్ ఆంటోనీ ఇద్దరు పిల్లలను దత్తతు తీసుకున్నాడు. దీంతో టామ్ క్రూయిజ్‌కు మొత్తం ముగ్గురు పిల్లలు.

ఇక టామ్ క్రూయిజ్ పేరున చాలా వరకు ఎస్టేట్స్ ఉన్నాయి. వీరిద్దరి విడాకుల నేపద్యంలో న్యూయార్క్‌లో ఉన్న అతి పెద్ద విడాకుల న్యాయవాది విక్కీ జైగ్లర్ మాట్లాడుతూ క్యాట్ హాల్మస్, టామ్ క్రూయిజ్‌ల కూతురైన సూరి క్రూయిజ్ లైఫ్ స్టయిల్ నిర్వహణ(కార్లు, కార్యకలాపాలు, బట్టలు, జుట్టు అపాయింట్మెంట్ల)కు గాను పెద్ద మొత్తంలో అవసరం అవుతుంది కాబట్టి విడాకుల అనంతరం టామ్ క్రూయిజ్, క్యాట్ హాల్మస్‌కు భారీ మొత్తంలో చెల్లించనున్నట్లు తెలిపాడు. విడాకులు ఫైనలైజ్ అయిన తర్వాత నవంబర్ 2006 నుండి ఇద్దరూ వారి వారి ప్రాజెక్టుల ద్వారా వచ్చిన సంపాదనను తెలుపుతారు.

బేవరి హిల్స్‌లో ఉన్న $35 మిలియన్ ఖరీదైన మాన్షన్‌తో పాటు సంవత్సరానికి గాను క్యాట్ హాల్మస్‌కు $3 మిలియన్లు భరణం క్రింద లభించనుందని సమాచారం. కాలిఫోర్నియా కమ్యూనిటీ ఆస్తి చట్టాలలో ముందున్న వివాహ ఒప్పందం ప్రకారం ఏదైనా జంట 11 సంవత్సరాల పాటు కలిసి జీవించి.. ఆ తర్వాత విడాకులు తీసుకున్నట్లైతే వారి ఆస్తులు ఆ జంట ఇద్దరికీ 50/50 సమానంగా పంచబడతాయి. కానీ వీరి విషయంలో అలా జరగదు. ఎందుకంటే టామ్ క్రూయిజ్, క్యాట్ హాల్మస్ ప్రేమించి వివాహం చేసుకోని కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే అవుతుంది.