4 జులై, 2012

అల్లు అర్జున్ సినిమాలో ఉదయభాను ఐటం సాంగ్

గతంలో లీడర్ చిత్రంలో ఐటం సాంగ్ చేసి అదరకొట్టిన యాంకర్ కమ్ ఆర్టిస్ట్ ఉదయభాను మరోమారు వెండితెరపై తన ప్రతిభను ప్రదర్శిస్తోందని సమాచారం. అల్లు అర్జున్ తాజా చిత్రం జులాయి లో ఆమెపై ఓ ఐటం సాంగ్ ని చిత్రీకరించారని సమాచారం. మొదట్లో వేరే బాలీవుడ్ భామను అనుకున్నా తర్వాత ఆమెకన్నా ఉదయభాను అయితే బెస్ట్ అని భావించి త్రివిక్రమ్ ఈ షూట్ చేసినట్లు ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది. అయితే దీనిపై ఎక్కడా వార్తలు ఏమీ అఫీషియల్ గా రాలేదు. నిజమా కాదా అన్నది తేలాలంటే రిలీజ్ దాకా ఆగాల్సిందే.

అల్లు అర్జున్,ఇలియానా కాంబినేషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న రొమాంటిక్ ఎంటర్టనర్ 'జులాయి'. ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకన్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు మార్కెట్లో అదరకొడుతున్నాయి. ఈగ రిలీజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా రిలీజ్ ని ఓ వారం ముందుకు జరిపారు.''జీవితాన్ని తేలిగ్గా తీసుకొనే యువకుడి చుట్టూ మా 'జులాయి' కథ తిరుగుతుంది. వినోదం, యాక్షన్‌ అంశాలు సమపాళ్లలో ఉంటాయి. త్రివిక్రమ్‌ శైలి సంభాషణలు, అర్జున్‌ నృత్యాలు అలరిస్తాయని''అన్నారు నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ.

అలాగే...జీవితాన్ని ఆస్వాదించడం ఎలాగో చాలామందికి తెలీదు. పరుగులు తీసే వయసులో చదువు, ఉద్యోగం.. అంటూ ముందర కాళ్లకు బంధమేసుకొంటారు. అన్నీ అందాక... ఇక పరిగెట్టే ఓపిక ఉండదు. అందుకే జోష్‌ ఉన్నప్పుడే జల్సా చేయాలి... అన్నది ఆ కుర్రాడి సిద్ధాంతం. జులాయి, దేశముదురు అని పిలుస్తారేమో అన్న బెంగలేదు. ఈ బిరుదులుంటేనే అమ్మాయిలు సులభంగా ప్రేమలో పడిపోతారనేది అతని నమ్మకం. అదే నిజమైంది. ఓ అందాల భామ ఈ జులాయికి మనసిచ్చేసింది. ఆ తరవాత ఏం జరిగిందో తెరపైనే చూడాలి అన్నారు.

అలాగే కథానుగుణంగానే కాక, పాత్రోచితంగా కూడా ఈ చిత్రానికి ‘జులాయి' పేరే సరైనది అని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్ణయించారు. ఇందులో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ప్రేక్షకుల్లోకి బుల్లెట్స్‌లా దూసుకుపోతాయని, అవి అల్లు అర్జున్ నోట ఆటంబాంబుల్లా పేలతాయని సమర్పకుడు డీవీవీ దానయ్య చెబుతున్నారు. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, సోనుసూద్‌, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తులసి, ప్రగతి, హేమ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.