8 జులై, 2012

ఎన్టీఆర్‘బాద్ షా’రిలీజ్ అంత లేటా?ఎన్టీఆర్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో భారీగా ‘బాద్ షా'చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. త్వరలో ఇటలీలో షూటింగ్ మొదలు కానున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. అయితే ఎన్టీఆర్ అబిమానులు మాత్రం ఈ విషయంలో నిరాశగా ఉన్నారు. అప్పటివరకూ మార్కెట్లో ఎన్టీఆర్ సినిమా ఏదీ ఉండదు కదా బాగా గ్యాప్ వస్తుందని అంటున్నారు. త్వరగా ఫినిష్ చేసి ఈ సంవత్సరంలోనే విడుదల చేస్తే 2012లోనే ఎన్టీఆర్ కు ఓ సూపర్ హిట్ పడినట్లు అవుందని చెప్తున్నారు.
ఇక ఈ చిత్రం తొలి షెడ్యూల్ ను ఏకధాటిగా 50 రోజుల పాటు ఇటలీలో ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. జూ ఎన్టీఆర్-కాజల్ కాంబినేషన్లో ఇప్పటికే బృందావనం లాంటి హిట్ సినిమా రావటంతో మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఫ్యామిలీ అండ్ హిల్లేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందించనున్నాడు.


ఇక ఈ విషయమై స్క్రిప్టు రైటర్ కోన వెంకట్ తన ట్విట్టర్ పేజీలో...ఈ సినిమాలో ఎన్టీఆర్ బ్రాండ్ న్యూ అవతార్ లో కనిపించనున్నాడు. ఎన్టీఆర్ అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే ఉంటారు అన్నారు. ఇక అందుకోసం ప్రత్యేకంగా ముంబై నుంచి మేకప్ స్పెషలిస్టులు వచ్చి మరీ ఎన్టీఆర్ ని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. అందుకోసం ప్రత్యేకమైన ఫోటో సెసన్స్ కూడా నడిచాయి. దాంతో ఆ క్యూరియాసిటీ పోకుండా ఫస్ట్ లుక్ వదిలేవరకూ ఎన్టీఆర్ పబ్లిక్ లోకి రాకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం.


ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ...సినిమా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది అన్నారు. శ్రీను వైట్ల,ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే జనం రకరకాలు అంచనాలు వేస్తున్నారు. వాటినన్నిటికీ అతీతంగా కథ,కథనం ఉంటాయి. పూర్తిగ మొదటినుంచి చివరి వరకూ పొట్ట పగిలేలా నవ్విస్తాము అన్నారు. గబ్బర్ సింగ్ తో సూపర్ హిట్ కొట్టిన గణేష్,దూకుడుతో సూపర్ హిట్ కొట్టిన శ్రీనువైట్ల కాంబినేష్ కాబట్టి తమకీ ఆ రేంజి హిట్ పడుతుందని ఎన్టీఆర్ పూర్తి నమ్మకంగా ఉన్నారు. ట్రేడ్ లో సైతం ఆ నమ్మకంతో హైప్ క్రియేట్ అవుతోంది.