4 జులై, 2012

రెమ్యునరేషన్ గా బంగారం తీసుకున్న జూ.ఎన్టీఆర్?

















యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా తన రెమ్యునేషన్ నిమిత్తం బంగారం తీసుకున్నాడంటూ ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే..ఎన్టీఆర్ మలబార్ గోల్డ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్నారు. గత కొంత కాలంగా ఈ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తున్న ఎన్టీఆర్ తన కొత్త ఎగ్రిమెంట్ లో భాగంగా ఈ సారి బంగారం ని రెమ్యునేషన్ ని అడిగినట్లు చెప్తున్నారు. ఎందుకంటే డబ్బు కన్నా బంగారం మంచి ఇన్వెస్టిమెంట్ అని ఎన్టీఆర్ భావించబట్టే ఇలా చేస్తున్నాడని చెప్తున్నారు. అలాగే తనే బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి పూర్తి క్వాలిటీ బంగారం లభిస్తుందని కూడా ఇలా చేస్తున్నారంటున్నారు.

ఇక కేరళ బేసెడ్ కంపెనీ అయిన మలబార్ గోల్డ్ ..ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా చేయటంతో తమ బ్రాండ్ వ్యాల్యూ ఆంధ్రాలో పెరిగి బిజినెస్ పెరిగిందని ఆనందపడుతున్నారని చెప్తున్నారు. దాంతో వీరు ఆ ఎగ్రిమెంట్ కి వెంటనే ఓకే చేసారని చెప్తున్నారు. అయితే ఎన్టీఆర్ తన రెమ్యునేషన్ క్రింద ఎన్ని కిలోల బంగారం తీసుకుని ఉండవచ్చు అనేది ఇప్పుడు అందరిలో కలుగుతున్న ప్రశ్న.ప్రస్తుతం ఎన్టీఆర్ బాద్షా బిజీలో ఉన్నారు. తొలి షెడ్యూల్ ను ఏకధాటిగా 50 రోజుల పాటు ఇటలీలో ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది.

జూ ఎన్టీఆర్-కాజల్ కాంబినేషన్లో ఇప్పటికే బృందావనం లాంటి హిట్ సినిమా రావటంతో మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఫ్యామిలీ అండ్ హిల్లేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందించనున్నాడు. ఇప్పటికే రెడీ, దూకుడు లాంటి చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న శ్రీను వైట్ల ఈ సారి అంతకు మించిన ఎంటర్ టైన్మెంట్ సబ్జెక్టుతో ‘బాద్ షా' చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. దూకుడు చిత్రానికి పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు చాలా మంది టెక్నీషియన్స్ ‘బాద్ షా' చిత్రానికి పని చేస్తున్నారు. ఈ సినిమా మరో దూకుడు అవుతుందని,ఆ రేంజిని దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.

ఎన్టీఆర్ సైతం ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...సినిమా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది అన్నారు. శ్రీను వైట్ల,ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే జనం రకరకాలు అంచనాలు వేస్తున్నారు. వాటినన్నిటికీ అతీతంగా కథ,కథనం ఉంటాయి. పూర్తిగ మొదటినుంచి చివరి వరకూ పొట్ట పగిలేలా నవ్విస్తాము అన్నారు. 

గబ్బర్ సింగ్ తో సూపర్ హిట్ కొట్టిన గణేష్,దూకుడుతో సూపర్ హిట్ కొట్టిన శ్రీనువైట్ల కాంబినేష్ కాబట్టి తమకీ ఆ రేంజి హిట్ పడుతుందని ఎన్టీఆర్ పూర్తి నమ్మకంగా ఉన్నారు. ట్రేడ్ లో సైతం ఆ నమ్మకంతో హైప్ క్రియేట్ అవుతోంది.