1 జులై, 2012

రామ్ చరణ్ కోసం రీమిక్స్ సాంగ్ చేస్తున్నా:తమన్
రామ్ చరణ్, వివి వినాయిక్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేఫధ్యంలో తమన్ రీసెంట్ గా రామ్ చరణ్ ప్యాన్స్ ని ఉత్తేజపరిచేలా ట్వీట్ చేసారకు. ఆ ట్వీట్ లో...పాత పాటను రీమిక్స్ చేయటం అనేది చాలా చాలా కష్టమైన పని. చెర్రీ,వినాయిక్ గార్ల సినిమా కోసం ఓ సూపర్ కూల్ సాంగ్ కంప్లీట్ చేసాను. అయితే ఆ పాటను సినిమాలో వాడతారని ఖరారు చేసి చెప్పలేను అని ట్వీట్ చేసారు.

ఈ చిత్రంలో గువ్వా గోరింక తో పాట రీమిక్స్ చేయనున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. చిరు సూపర్ హిట్స్ లో ఒకటైన ఖైది నెంబర్ 786 లో చిరంజీవి, భానుప్రియ లపై చిత్రీకరించిన పాట ఇది. గతంలోనూ రాజమౌళి తో చేసిన మగధీర లో బంగారు కోడిపెట్ట పాటను, రామ్ చరణ్ తాజా చిత్రం రచ్చ లో వాన వాన వెల్లువాయే పాటలు రీమిక్స్ చేసి హిట్ కొట్టారు. అలాగే ఈ చిత్రానికి రామ్ చరణ్ నిక్ నేమ్ అయిన చెర్రి అని పెడదామని పిక్స్ అయినట్లు సమాచారం. గతంలో అల్లు అర్జున్ తో సినిమా చేసి అతని నిక్ నేమ్ అయిన బన్ని అని పెట్టిన వినాయిక్ ఈ సారి చెర్రీతో ఆ రేంజి హిట్ కొడదామని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

కాజల్ అగర్వాల్,అమలా పాల్ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని యూనివర్శల్ స్టూడియో బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథ... తండ్రికిచ్చిన మాట కోసం తనయుడు ఏం చేశాడనే పాయింట్ చుట్టూ తిరుగుతుంది. చిన్నపాటి టెన్షన్ తోపాటు మంచి యాక్షన్‌ సీన్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ ఏ మాత్రం తగ్గని సినిమా.

దర్శకుడు వినాయక్‌ చిత్రం గురించి చెబుతూ ..చిరంజీవిగారితో 'ఠాగూర్‌' తీసిన రోజులు గుర్తొస్తున్నాయి. తప్పకుండా అందరినీ మెప్పించే సినిమా తీస్తామని అన్నారు. నిర్మాత ఈ చిత్రం గురించి మాట్లాడుతూ...చరణ్‌ని ఒక కొత్త తరహా పాత్రలో చూపెట్టబోతున్నారు దర్శకుడు. వినోదం, యాక్షన్‌... తదితర అంశాలు అభిమానుల్ని మెప్పించేలా ఉంటాయి. వాణిజ్య విలువలతో కూడిన కథాంశమిది. వినోదాత్మకంగా సాగుతుంది.

తమన్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ కథలో మరో హీరోయిన్ కీ స్థానం ఉంది. ఆమె అమలా పౌల్. ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ చేస్తోంది.'మగధీర' తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రమిదే. సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, కథ, మాటలు: ఆకుల శివ,ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు.