17 జులై, 2012

ఫ్యామిలీతో సహా‘షిరిడి సాయి’ షూటింగుకు నాగ్
అన్నమయ్య, శ్రీరామదాసు వంటి అద్భుత చిత్రాల తర్వాత కింగ్ నాగార్జున, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కాంబినేషన్లో వస్తున్న మరో ఆధ్యాత్మిక చిత్రం ‘షిరిడి సాయి'. ఈచిత్రం షూటింగ్ ఈనెల 26తో పూర్తి కానుంది. జూలై 25న ఓ స్పెషల్ ట్రైన్‌లో కింగ్ నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, నిర్మాత ఎ. మహేష్ రెడ్డి, సంగీత దర్శకుడు యం.యం.కీరవాణిలతో పాటు యూనిట్ సభ్యులు కుటుంబ సమేతంగా షిరిడీ వెలుతున్నారు. జూలై 26న ఈచిత్రానికి సంబంధించి చివరి షాట్ చిత్రీరించనున్నారు. అదే రోజు ‘షిరిడి' సాయి ఆడియో సీడీని బాబా పాదల చెంత ఉంచి పూజ నిర్వహించనున్నారు. జూలై 30వ తేదీన ఈచిత్రం ఆడియో హైదరాబాద్‌లో రిలీజ్ చేస్తారు. సెప్టెంబర్ 6న సినిమా థియేటర్లలోకి రానుంది.

శ్రీకాంత్, శరత్ బాబు, సాయికుమార్, శ్రీహరి, షాయాజీ షిండే, డా. బ్రహ్మానందం, అలీ, సంపత్, అనంత్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ల భరణి, కమలిని ముఖర్జీ, రోహిణి హట్టంగడి, వినయ్ ప్రసాద్, మజుతా దేశ్ ముఖ్, కౌశిక్, నాగేష్ భోస్లే, దేవేందర్ డాడ్కే, దినకర్ గవండే, దీపాలి డాడ్కే, భవాని, రవిభట్, విజయ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

పరుచూరి బ్రదర్స్ సంభాషణలు సమకూర్చిన ఈ చిత్రానికి ఎంఎం కీవవాణి సంగీతం అందించారు. ఇందులోని పాటల్ని సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్, శ్రీరామ జోగయ్య శాస్త్రి, వేదవ్యాస్, మేడిచర్ల సత్యనారాయణ మూర్తి తదితరులు వ్రాశారు. ఛాయాగ్రహణం : ఎస్.గోపాలరెడ్డి, ఎడిటింగ్ : శర్వన్, కళ : భాస్కర రాజు, శ్రీకాంత్, కథా సంకల్పం : భక్త సురేష్, కథా సహకారం : పొందూరి హనుమంతరావు, కో డైరెక్టర్ : ఎ.ఎస్. రవీంద్రబాబు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : కె. విక్రమ్ కుమార్, నిర్మాత : ఎ. మహేష్ రెడ్డి, సమర్పణ : శ్రీమతి సులోచనారెడ్డి, దర్శకత్వం : కె. రాఘవేంద్రరావు