8 జులై, 2012

బాబ్రీ కూల్చివేతప్పుడు పూజలో కూర్చున్న పివి
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని పివి నర్సింహారావుపై మరో విమర్శ వచ్చింది. కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చివేస్తున్న సమయంలో పివి నర్సింహారావు పూజలో కూర్చున్నారని, కూల్చివేత పూర్తయిన తర్వాతనే పూజ నుంచి లేచారని ప్రముఖ జర్నలిస్టు కుల్దీప్ నయ్యర్ ఆరోపించారు. రోలీ బుక్స్ ప్రచురిస్తున్న తన ఆత్మకథ బియాండ్ లైన్స్‌లో ఆయన ఈ ఆరోపణ చేశారు. ఈ పుస్తకం త్వరలో విడుదల కాబోతోంది.

బాబ్రీ మసీదు కూల్చివేతకు పివి నర్సింహారావు సహకరించారని చెప్పడానికి ఆయన ఈ ఆరోపణ చేశారు. కుల్దీప్ నయ్యర్ ఆత్మకథలో పివి నర్సింహారావు ప్రభుత్వం అనే అధ్యాయం ఉంది. పూజలో కూర్చున్న పివి నర్సింహారావు చెవిలో ఆయన సహాయకుడు మసీదును కూల్చారని ఊదాడని, ఆ తర్వాత క్షణాల్లోనే పివి పూజ ముగించారని మధు లిమాయే (సోషలిస్టు నాయకుడు) తనతో చెప్పారని ఆ అధ్యాయంలో కుల్దీప్ నయ్యర్ రాశారు.

కుల్దీప్ నయ్యర్ ఆరోపణను పివి నర్సింహారావు కుమారుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పివి రంగారావు ఖండించారు. ఆ మాటలు నమ్మశక్యంగా లేవని ఆయన అన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేతపై పివి ఆగ్రహం చెందారని, ఏళ్ల తరబడి ముస్లింలను పివి ప్రేమించారని, అది జరిగి ఉండాల్సింది కాదని తమతో చాలా సార్లు అన్నారని ఆయన వివరించారు. కుల్దీప్ నయ్యర్ వంటి ప్రముఖ జర్నలిస్టు స్వార్థ ప్రయోజనాల కోసం తన తండ్రిపై విషం చిమ్మడం సరి కాదని ఆయన అన్నారు.

బాబ్రీ కూల్చివేత తర్వాత అల్లర్లు చెలరేగినప్పుడు పివి నర్సింహారావు కొంత మంది జర్నలిస్టులను తన నివాసానికి ఆహ్వానించారని కుల్దీప్ నయ్యర్ రాశారు. కూల్చివేతను అపడానికి తాము చేసిన ఏర్పాట్లను వివరించడానికి బాధపడ్డారని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ తనను మోసం చేశాడని పివి చెప్పారని ఆయన రాశారు.

కాంగ్రెసు పార్టీలో మసీదు కూల్చివేత వల్ల లుకలుకలు ప్రారంభం కాలేదని, అంతర్గత వైరుధ్యాల వల్లనే లుకలుకలు పుట్టాయని, పివి నర్సింహారావును సోనియా గాంధీ ఎప్పుడూ ఇష్టపడలేదని నయ్యర్ రాశారు.

7 వ్యాఖ్యలు:

Truely చెప్పారు...

Any one commenting on P.V.NarasimhaRao, Should watch this video from PVRK Prasad (Rtd.IAS). please watch this completely.

http://ap7am.com/lv-72738-discussion-did-pv-narasimha-rao-conspire-the-demolition-of-babri-masjid.html

శివరామప్రసాదు కప్పగంతు చెప్పారు...

@Truely

Excellent video link, Thank you. Shri Prasad's analysis at the end of the programme is right on dot.

SNKR చెప్పారు...

సోనియా పెంపుడు కుక్క లాంటి అర్జున సింగ్ చెప్పినదానికి ఏమన్నా విలువవుంటుందా? ఇప్పుడు కుష్వంత్ సింగ్ బురద చల్లడం హాస్యాస్పదంగా వుంది.
పూజలో కూచోవడం సూడో సెక్యులరిస్టులకు నచ్చలేదేమో, నమాజ్ చేసుండాలనుకుంటున్నారేమో.

Rao S Lakkaraju చెప్పారు...

పూజలో కూచోవడం సూడో సెక్యులరిస్టులకు నచ్చలేదేమో, నమాజ్ చేసుండాలనుకుంటున్నారేమో.
@SNKR వావ్.

అజ్ఞాత చెప్పారు...

శంకర్, కుష్వంత్ సింగ్ కాదు. కులదీప్ నయ్యర్. పంజాబీ గాడు. వీళ్లకి బాగా డబ్బులుండే ఇళ్లలో పుట్టటం చేత ఆరోజుల్లో కేంబ్రిడ్జ్,ఆక్స్ఫర్డ్ లో చదువు వెలగబేట్టే వారు. దేశ సంస్కృతి, పేద మధ్య త్సరగతి తో ఎమాత్రం సంబంధం లేని ప్రవాస పాకిస్తానీయులు. ఇతనే కాదు కరణ్ థాపర్ కూడా పాక్ పంజాబ్ నుంచి ఇండియాకు వచ్చిన వాడు. నాకు పాకిస్తాన్ అంటే ప్రేమ, ఇంకా అక్కడివారితో సత్సంబంధాలు ఉన్నాయి అని చెప్పాడు. పుట్టిపెరిగిన ఊరంటే ప్రేమ ఉండటం లో తప్పు లేదు. కాని ఈ భుస్వామ్య స్వభావం కలిగిన కొంతమంది నార్త్ ఇండియా మేధావులు, ఎప్పుడు భూ సంస్కరణలు , ఎకనామిక్ పాలసిల మీద కన్నా ఎక్కువగా పాకిస్తాన్ తో దోస్తి గురించి, సెక్యులరిజం గురించి జీవితకాలం ప్రేమ కురిపించారు. కాని వారు ఆదేశంతో సత్సంబందాలను మెరుగు పరచటంలో సాధించిన ప్రగతి ఎమీటో చెపితే బాగుంట్టుంది. పి వి నరసిమ్హారావు సెక్యులర్ క్రెడెంటియల్స్ మీద చర్చించి సాధించేది ఏముంది.
కోర్టు తీర్పు ఎప్పుడో పి వి కి అనుకూలంగా వచ్చిందికదా!

SriRam

SNKR చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
SNKR చెప్పారు...

శ్రీరాం గారు, నా పొరపాటు సవరించినందుకు కృతజ్ఞతలు, కుష్వంత్ సింగ్ గారికి క్షమాపణలు. నాకు సాధారణంగా నచ్చే కొద్ది వ్యాఖ్యతల్లో మీరొకరు. :)

ఒకప్పుడు ఇందిరాగాంధీని, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రాసి మదపుటేనుగునెదుర్కొన్న కులదీప్ నయర్, ముసలివయసులో అర్జున్‌సింగ్ లాంటి వాళ్ళ తోక ఆసరాగా తీసుకోవడం, పోస్ట్ మార్టం గాలి కబుర్లు రాసి పొట్టపోసుకునే దుర్గతి పట్టడం బాధాకరం. ప్చ్.. విధి బలీయమైనది :(
పాకీయులపై ప్రేమ అన్నది అక్కడ తమ ఆస్థులు సంరక్షించుకోవడం, సెక్యులరిస్టు అని ముద్రవేయించుకునే కుతి లాంటి స్వీయ ప్రయోజనాలను పరిరక్షించుకోవడమో, కానీ ఖర్చులేకుండా ఏ అరుధతి రాయ్ లానో మందలో ప్రత్యేకంగా కనపడాలనో... ఏదో వారి తాపత్రయం!! పాపం.
--
రావు గారు :)
పి.వి. ఓ గదిలో (అప్పటి ప్రధాని నివాసంలో పూజ గది అంటూ లేదని పివి గారి అంతరింగికులు చెప్పారు) తలుపులేసుకుని కూర్చున్నారు అంటే పూజచేసుకుంటున్నారు అని మసాలా వేసుకుని వూహాగానాలు చేశారు కాని, తమ సెక్యులర్ భావాలకు అనుగుణంగా నమాజ్ చేసుకున్నారు అని ఎందుకు వూహించలేక పోయారో ఈ ఎదవలు! :O