4 జులై, 2012

ఆటోనగర్ సూర్య’దర్శకుడు దేవకట్టా నటుడుగా...వెన్నెల, ప్రస్దానం చిత్రాలతో తనకంటూ ముద్ర వేసుకున్న దర్శకుడు దేవకట్టా. ఆయన తాజాగా ఓ చిత్రంలో నటుడుగా కనిపించి అలరించనున్నారు. వరుణ్ సందేష్,సుదీప్ కృష్ణన్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఓ కొత్త చిత్రంలో కీ రోల్ లో చేయటానికి దేవకట్టా ఓకే అన్నట్లు సమాచారం. క్రైమ్ కామెడీ గా చెప్తున్న ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు సిరాజ్ డైరక్ట్ చేస్తున్నారు. మెలోని ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం చేస్తోంది.

రాజ్ నిడిమోరు మరియు కృష్ణ డికే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో వీరివురు కలిసి గతంలో "99″ మరియు "షోర్ అండ్ ది సిటి" వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. వీరు రిక్వెస్ట్ మేరకే దేవకట్టా ఈ చిత్రం కమిటయ్యారు. ఇంకోసారి చిత్రానికి స్క్రీన్ ప్లే అందించింది వీళ్లిద్దరూ తెలుగులో మెదటిసారిగా ఈ చిత్రంతో నిర్మాతలుగా మారుతున్నారు. ఈ చిత్రంతో సిరాజ్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ చిత్రం ప్రధాన షూటింగ్ ఇప్పటికే హైదరాబాద్ లో మొదలయ్యింది.

ఇక దేవకట్టా విషయానికి వస్తే..నాగచైతన్య హీరోగా ‘ఆటోనగర్ సూర్య'చిత్రం డైరక్ట్ చేస్తున్నారు. సమంత హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం స్టోరీ లైన్ ఏమిటంటే...విజయవాడలో బెంజ్‌ సర్కిల్‌ ఎంత ఫేమసో... ఆటోనగర్‌ సూర్య కూడా అంతే. తనకు తెలిసిన పని చేసుకొంటూ... ఆ రంగంలో ఎదగాలనుకొనే రకం. ఒకరి హక్కును కబ్జా చేస్తే మాత్రం ఊరుకోడు. అందుకే సూర్య పేరు చెబితే రౌడీమూక గుండెల్లో కంగారు మొదలవుతుంది. ఇలాంటి మనస్తత్వమున్న సూర్య జీవితంలోకి ఎవరెవరు వచ్చారు? అతని ప్రయాణానికి అడ్డుగా నిలిచిన వారికి ఎలా బుద్ధిచెప్పాడు? అన్నట్లుగా 'ఆటోనగర్‌ సూర్య' నడుస్తుంది. మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి నిర్మాత కె.అచ్చిరెడ్డి.