11 జులై, 2012

మంచు మనోజ్ పై మరో హీరో పోలీస్ కేసు
రీసెంట్ గా తెలుగు నటుడు మంచు మనోజ్ పై చెన్నైలో పోలీస్ కేసు నమోదైంది. తనను ధూషించాడంటూ తమిళ నటుడు మహత్ రాఘవేంద్ర కంప్లైంట్ చేసారు. ఫిల్మ్ ఫేర్ అవార్డుల పంక్షన్ తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది. చెన్నై పోలీస్ స్టేషన్ లో నమోదు చేసిన ఎప్.ఐ.ఆర్ ప్రకారం...మహత్ రాఘవేంద్ర తాను తన ప్రెండ్ తో కలిసి ప్రేవేట్ గా మాట్లాడుకుంటూంటే వచ్చి కొట్టడం ప్రారంభించారు. కారణమేమిటో చెప్పకుండా మనోజ్ ఆయన ముగ్గురు స్నేహితులు నన్ను కొట్టారు. నా మొహం పై ,నా పొట్టపై వారు తీవ్రంగా కొట్టారు. అక్కడున్న ఎవరూ కూడా మా మధ్యకి వచ్చి నన్ను సేవ్ చేయాలని చూడలేదు.

కాస్సేపటికి అందరూ పోగవగా కొట్టడం ఆపి నా చావు అతని చేతిలోనే ఉందని వార్నింగ్ ఇచ్చి వార్నింగ్ ఇచ్చారు. తనకు ప్రాణ రక్షణ కల్పించవల్సిందిగా ఆ ఎఫ్.ఐ.ఆర్ లో మహత్ రాసారు. ఇక చెన్నై మీడియా సమాచారం ప్రకారం తాప్సీ విషయమై ఈ విభేదాలు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. తాప్సీ,మహత్ గత కొద్ది రోజులుగా డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. దాంతో మంచు మనోజ్ మండిపడ్డాడని తమిళ మీడియా రాసుకొచ్చింది. తాప్సీ,మంచు మనోజ్ తొలిసారిగా ఝుమ్మంది నాదం చిత్రంలో నటించారు. తాప్సీ తొలి చిత్రం అదే. సినిమా ఆడకపోయినా ఆమె ఆఫర్స్ కు మాత్రం లోటు లేదు.

ప్రస్తుతం మంచు మనోజ్...ఊ కొడతారా ఉలిక్కి పడతారా అనే చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సెకండాఫ్ ప్లాష్ బ్యాక్ లో వచ్చే పాత్ర. ఉండేది కొద్ది సేపే అయినా పెదరాయుడులో రజనీకాంత్ లాగ అదరకొడతాడని చెప్తున్నారు. దాంతో బిజినెస్ కూడా బాగా స్పీడుగా జరుగుతోందని వినికిడి. ఇక మంచు మనోజ్ సినిమాలు వరసగా భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అవుతూ వస్తున్నాయి. ఈ నేఫధ్యంలో ఈ కొత్త చిత్రానికి ఎంత వరకూ ఓపినింగ్స్ వస్తాయనేది సందేహమే. అయితే ఇక్కడే బాలకృష్ణ ఆదుకుంటాడు. ఆయన సినిమా గా భావించిన నందమూరి ప్యాన్స్ ఈ సినిమాకు మంచి ఓపినింగ్స్ ఇస్తారని,అదే స్టాటజీ అని చెప్పుకుంటున్నారు. మరో ప్రక్క ఈ చిత్రం ట్రైలర్ కూడా అందరిలో ఆసక్తి రేపుతోంది.

బాలకృష్ణ ఈ ప్రాజెక్టుపై బాగా నమ్మకంగా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ...'శ్రీరామరాజ్యం, ఊ కొడతారా ఉలిక్కిపడతారా చిత్రాలలో నటించే అవకాశం రావడం అదృష్టం. ఓ వరం' అని అన్నారు. అలాగే ఊ కొడతా రా... ఉలిక్కి పడతారా చిత్రం భారీ ఎత్తున తెరకెక్కిం దన్నారు. ఈ చిత్రాన్ని మంచు లక్ష్మీప్రసన్న నిర్మిస్తున్నారన్నారు. తండ్రి మోహన్‌బాబు క్రమశిక్షణను పునికి పుచ్చుకున్న లక్ష్మీప్రసన్న ఈ చిత్రా న్ని ఖర్చుకు వెనుకాడకుండా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. ఈ చిత్రం కోసం రూ.6 కోట్ల వ్యయంతో గంధర్వ మహల్ సెట్‌ను వేసినట్లు చెప్పారు. మంచు మనోజ్ మరో హీరోగా చక్కగా నటించారని బాలకృష్ణ ప్రశంసించారు.