4 జులై, 2012

ఇలియానా పవన్ కి హ్యాండ్ ఇచ్చిందా?
హాట్ బ్యూటీ ఇలియానా ఇప్పుడు మంచి ఫామ్ లో ఉంది. ఆమె రెండు చిత్రాలు దేముడు చేసిన మనుష్యులు,జులాయి కొద్ది వారాల తేడాలో విడుదల అవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆమె యుటివీ వారికి మూడు సినిమాలు చేయటానికి ఎగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఆమె యుటీవి వారి బర్ఫీ చిత్రం కంప్లీట్ చేసింది. ఆ తర్వాత ఆమె వెట్టై హిందీ రీమేక్ లో చేయనుంది. అజయ్ దేవగన్ సరసన ఆ చిత్రంలో కమిటైంది. ఇక మూడో చిత్రం వివరాలు తెలిసి రాలేదు. దాంతో ఆమె పవన్,త్రివిక్రమ్ కాంబినేషన్ కష్టమే అంటున్నారు.

జల్సా కాంబినేషన్ రిపీట్ అలవుతుందని,మళ్లీ ఆ కాంబినేషన్ క్రేజ్ వస్తుందని ట్రేడ్ లో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు పూర్తిగా ఇలియానా బాలీవుడ్ పై దృష్టి పెట్టి ఈ సినిమా వదిలేసిందనే వార్త మీడియాలో ప్రచారం అవుతోంది. దాంతో ఈ విషయమై ఇలియానా మేనేజర్ మాట్లాడుతూ...అలాంటి ఎగ్రిమెంట్ ఏమీ లేదు. ఇలియానా తప్పకుండా పవన్ చిత్రంలో చేస్తుంది. త్రివిక్రమ్ దానిని డైరక్ట్ చేస్తారు అన్నారు. అంతేగాక ఆమె తమిళ,తెలుగు భాషల్లో ఎన్నో స్క్రిప్టులు వింటోంది. మరో ప్రక్క హిందీలోనూ ఆమెకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి అన్నాడు.

ఇక దక్షిణాదిలో ఇలియానా కెరీర్‌ విషయానికి వస్తే, 'కిక్‌' తర్వాత వరుసగా ఐదు ఫ్లాప్‌లు రావడంతో ప్రస్తుతానికి ఇక్కడ డల్‌గానే ఉంది. ఈ మధ్యనే తమిళ దర్శకుడు శంకర్‌ తీసిన 'స్నేహితుడు' (అమీర్‌ఖాన్‌ '3 ఈడియెట్స్‌' రీమేక్‌)లో కనిపించిన ఈమెకు కలిసిరాలేదు. ఆ సినిమా ప్లాప్ కావటం ఆమెకు తెలుగులో ఇబ్బందికర పరిస్దితి తెచ్చిపెట్టింది. దాంతో ఆమె తన దృష్టి మొత్తాన్ని బాలీవుడ్ పైనే పెట్టింది. ప్రస్తుతం ఆమె తెలుగులో అల్లు అర్జున్ సరసన త్రివిక్రమ్ దర్సకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడిలో నటిస్తోంది. ఈ చిత్రం ఆమెకు పూర్వ వైభవం తెచ్చిపెడుతుందని భావిస్తోంది.

అక్షయ్‌ కుమార్‌ హీరోగా నిర్మించబోయే 'వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ ముంబై 2', 'ఖిలాడీ 786' చిత్రాల్లో ఇలియానాకు అవకాశం సంపాదించింది. 2010లో ఏక్తా కపూర్‌ నిర్మించిన 'వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ ముంబై'కి ఈ చిత్రం సీక్వెల్‌ . మాఫియా డాన్‌లు దావూద్‌ ఇబ్రహీం (అక్షయ్‌), చోటా రాజన్‌ (షాహిద్‌)ల మధ్య గల శతృత్వమే దీని ఇతివృత్తం. ఇక రెండో సినిమా 'ఖిలాడీ 786'ని హాస్య ప్రధాన చిత్రంగా అక్షయ్‌, హిమేష్‌ రేష్మియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రలో అనురాగ్‌ బసు రూపొందించిన 'బర్ఫీ'లో రణ్‌బీర్‌ కపూర్‌ భార్యగా ఇలియానా చేయటం ఆమెకు కలిసివచ్చింది. అయితే రిలీజైన తర్వాత గానీ ఆమె కేరీర్ ఏ రేంజికి వెళ్తుందో చెప్పలేమంటున్నారు బాలీవుడ్ పండితులు.