11 జులై, 2012

లాడెన్... సన్నీ ఫోర్న్ చిత్రాలు చూస్తూ చచ్చాడట!

కరడుగట్టిన టెర్రరిస్టు, అల్ ఖైదా అగ్రనేత ఒసామా బిన్ లాడెన్ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ సన్నీకి వీరాభిమాని అని, ఆమె సెక్సీ ఫిగర్‌కి దాసోహం అయ్యాడని, సన్నీ లియోన్ నటించిన అశ్లీల చిత్రాలకు లాడెన్ బానిసలా మారాడని, ఆ వీడియోలు చూస్తున్నప్పుడే అమెరికా దళాలు కాల్చి చంపాయని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

మీకు ఈ విషయం ఎలా తెలిసింది అంటే నా సోర్స్ నాకున్నాయి. నేను చెప్పింది నిజం అని నొక్కి వక్కానిస్తున్నాడు. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో పబ్లిసిటీ పెంచుకునే వర్మ తాజాగా సన్నీకి, లాడెన్‌కి లింకెట్టి తన పబ్లిసిటీ పిచ్చి చాటుకున్నాడు.

సన్నీ లియోన్ ప్రస్తుతం ‘జిస్మ్ 2' చిత్రంలో నటిస్తోంది. పూజాభట్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే మహేష్ భట్ అందించారు. డినో మోరియా, పూజా భట్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. సన్నీలియోన్‌తో పాటు రణదీప్ హూడా, అరుణోదయ్ సింగ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
 
ఈచిత్రం సినిమాపై అంచనాలు పెంచడంలో భాగా చిత్రం దర్శక నిర్మాతలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా తొలుత ఈచిత్రంలోని నటీనటుల కాస్టూమ్స్ వేలం వేయాలని నిర్ణయించారు. ఈ వేలంలో సన్నీ లియోన్ లోదుస్తులు కూడా వేలానికి పెట్టనున్నారట. బ్లూఫిల్మ్ తార కాబట్టి ఆమె లోదుస్తులు దక్కించుకోవడానికి శృంగార ప్రియులు పోటీ పడతారని అంచనా వేస్తున్నారు.