15 జులై, 2012

‘ఈగ’పై చిరంజీవి మెసేజ్... లెక్కచేయని రాజమౌళి!

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ' చిత్రం సూపర్ హిట్ టాక్‌తో దూసుకెలుతున్న నేపథ్యంలో సినీ ప్రముఖులంతా ఆయన చిత్రం అద్భుతంగా అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. రజనీ లాంటి పెద్ద స్టార్లు సైతం రాజమౌళి పని తనాన్ని మెచ్చుకున్నారు. తాజాగా ఈగ చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈగ చిత్రం తెలుగు సినిమా గర్వించదగ్గ చిత్రం అంటూ ప్రశంసించారు.

చిరంజీవి స్వయంగా కాల్ చేసి రాజమౌళికి ఈ విషయాన్ని చెప్పారు. వాస్తవానికి కాల్ చేయడానికి రెండు రోజుల ముందే చిరంజీవి వేరే ఫోన్ నెంబర్ నుంచి ‘బాయ్, సినిమా చూసి థ్రిల్ అయ్యాను' అంటూ రాజమౌళికి మెసేజ్ పెట్టారట. అయితే అది కొత్త నెంబర్ కావడంతో అది చిరంజీవి పేరు మీద వచ్చిన ఫేక్ మోసేజ్ అని లెక్కచేయలేదట రాజమౌళి. ఈ విషయాన్ని జక్కన్న ట్విట్టర్లో పేర్కొన్నారు.

జూలై 6న రిలీజ్ అయిన ‘ఈగ' చిత్రం నిన్నటితో వారం రోజులు పూర్తి చేసుకుంది. స్టార్ హీరోల సినిమాల మాదిరి ఊహించని విధంగా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా నిర్మాతలకు లాభాలను తెచ్చి పెడుతోంది. విజువల్ వండర్‌గా రూపొందిన ఈచిత్రం ఇంటర్నేషనల్ లెవల్లో చర్చనీయాంశం అయింది. ఈగ చిత్రం పుణ్యమా అని తెలుగు సినిమా ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఇదంతా రాజమౌళి క్రెడిటే.

1 వ్యాఖ్య:

అజ్ఞాత చెప్పారు...

nothing is impossible!!!he proved!!!