14 జులై, 2012

పవన్ కళ్యాణ్ నిజ జీవితం నుంచే ఆ పాత్ర
పవన్ కళ్యాణ్ నిజ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 'కెమెరామేన్ గంగతో రాంబాబు'లో రాంబాబు పాత్ర పుట్టిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆ పాత్ర పవన్ లో ఉన్న సమాజం పట్ల స్పష్టత,భాధ్యత,రాడికల్ మరియు రేషనల్ దింకింగ్ ని ఎలివేట్ చే్స్తుందని ఫల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. బద్రి నాటి నుంచి పవన్ ని దగ్గర నుంచి చూసిన దర్శకుడు పూరీ జగన్నాధ్... ఆయన లక్షణాలను ఇందులో పెట్టాసారని,లైవ్ గా క్యారెక్టర్ ఉండబోతోందని చెప్తున్నారు. ముఖ్యంగా పూరీకి మొదటినుంచి తన చుట్టూ చూసిన సంఘటనలునుంచి ప్రేరణ పొంది కథలు రాయటం అలవాటు కాబట్టి ఈ సారి కూడా అలాగే జరిగి ఉండవచ్చు అంటున్నారు.

తొలి కలయిక ‘బద్రి' తోనే సెన్సేషన్ సృష్టించిన పవన్‌ కళ్యాణ్-పూరి జగన్నాథ్. ‘బద్రి' తర్వాత వాళ్లిద్దరూ మళ్లీ కలిసి సినిమా చేయలేదు. మళ్లీ ఇన్నాళ్లకు వాళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘కెమెరామేన్ గంగతో రాంబాబు'. ‘గబ్బర్‌సింగ్' లాంటి సూపర్ హిట్ తర్వాత పవన్‌కళ్యాణ్ నటిస్తున్న సినిమా ఇదే కావటంతో మరింత క్రేజ్ వచ్చింది.

పవన్‌ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ పద్మాలయాలో జరుగుతోంది. ఇందులో పవర్‌స్టార్ మెకానిక్ గా నటిస్తున్నారు. నేటి రాజకీయాలపై ఓ వ్యంగాస్త్రంగా ఈ చిత్రాన్ని పూరీ రూపొందిస్తున్నట్లు సమాచారం. తమన్నా ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు. పవన్‌కళ్యాణ్,తమన్నా కలిసి నటిస్తున్న తొలి సినిమా కూడా ఇదే. అక్టోబర్ 18న గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిసింది.