2 జులై, 2012

'ఈగ'లో గెస్ట్ గా ఎస్పీ బాల సుబ్రమణ్యం
రాజమౌళి తాజా చిత్రం 'ఈగ'లో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గెస్ట్ గా కనిపించనున్నారు. ఆయన పాత్ర ఉండేది కొద్ది సేపైనా కథను కీలకమలుపు తిప్పుతుందని తెలుస్తోంది. ఆయన నిజ జీవిత పాత్రలోనే తెరపై జీవించనున్నారని సమాచారం. ఇక ఈ చిత్రం పై ఇప్పటికే విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. హైదరాబాద్ మొత్తం 'ఈగ'ప్రమోషన్ తో నింపేస్తున్నారు. ఎక్కడ చూసినా ఈగ పోస్టర్స్ కనపడేలా ప్లాన్ చేస్తున్నారు. టీవీ లోనూ ఈ చిత్రానికి సంభందించి రాజమౌళి డైలీ అప్ డేట్స్ ఇస్తూ పబ్లిసిటీ క్యాపైన్ చేస్తున్నారు.

నిర్మాత సాయి కొర్రపాటి మాట్లాడుతూ ''ఇటీవలే రాజమౌళి ఈగ కోసం సంభాషణలు పలికారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేలా ఉంటుందీ చిత్రం. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి సంబంధించిన పనులు తుది దశకు చేరాయి. జులై 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది'' అన్నారు. సురేష్ ప్రోడక్షన్ సమర్పణలో ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఛాయాగ్రహణం: సెంథిల్‌కుమార్‌, సమర్పణ: డి.సురేష్‌బాబు.

సినిమా మొదలైన అరగంటకే హీరో చనిపోతాడు. అయితే అతను ఈగ రూపంలో విలన్‌పై ఎలా పగ సాధించాడు అనేది సస్పెన్స్ అన్నారు ప్రముఖ దర్శకుడు రాజమౌళి. ఆయన తాజా చిత్రం'ఈగ'త్వరలో విడుదల కానున్న సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. ఎస్.ఎస్.రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఈగ'. తుది మెరుగులు దిద్దుకుంటోంది. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నాని, సమంత, సుదీప్ కీలక పాత్రధారులు. వారాహి చలనచిత్రం పతాకంపై తెరకెక్కుతోంది.

అలాగే రాజమౌళి మాట్లాడుతూ "బలవంతుడైన విలన్, బలహీనమైన ప్రాణి చేతిలో ఎలా ఓడిపోయాడు? ఎలా ప్రాణాలు కోల్పోయాడు? అనే అంశం చుట్టూ తిరిగే కథే 'ఈగ'. సంక్షిప్తమైన ఈ కథను నాని, సమంత, సుదీప్ అర్థం చేసుకుని చక్కగా నటించారు. చక్కటి ప్రేమ సన్నివేశాలు ఈ చిత్రంలో ఉంటాయి'' అని అన్నారు.'ఓ దుర్మార్గుడితో 'ఈగ' చేసిన పోరాటం ఈ కథ. అలాగని ఈగని ఆకాశమంత పెద్దదిగా చూపించడం లేదు. దానికేం అద్భుత శక్తుల్ని ఆపాదించడం లేదు. సాధారణ పరిమాణంలోనే ఉంటుంది. అయినా పోరాడుతుంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేశాం. తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల చేస్తామని అన్నారు.