7 జులై, 2012

శృంగార తారగా మరోసారి కత్రినా కైఫ్ సెన్సేషన్
ప్రపంచ శృంగార దేవతగా బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ మరోమారు ఎంపికై రికార్డు సృష్టించింది. ఈ ముద్దుగుమ్మకు మించిన మరొక సెక్సీయెస్ట్ అందగత్తే ఈ భూలోకంపై లేదని ఈ ఎఫ్‌హెచ్ఎం మ్యాగజైన్ నిర్వహించిన సర్వే తేల్చింది. హాలీవుడ్ హాట్ లేడీస్ మేగన్ ఫాక్స్, ఎంజెలీనా జోలీ, బేక్ లైవ్లీలను కత్రినా వెనక్కి నెట్టింది. ఈ సర్వేలో పాల్గొన్న వారంతా మత్తెక్కించే కైఫ్‌కే తన ఓటు వేసి అభిమానాన్ని చాటుకున్నారు.

కత్రినా సెక్సియెస్ట్ ఉమన్‌గా ఎంపిక కావడం ఇది వరుసగా నాలుగవ సారికాగా...టోటల్‌గా ఐదోసారి. ఈ సర్వేను ఆన్‌లైన్, ఎస్ఎంఎస్‌ల ద్వారా నిర్వహించారు. పద్దెనిమిది ఏళ్లుగా తాము ఈ పోల్ నిర్వహిస్తున్నామని, తమ పోల్‌లో నాలుగు సార్లు మొదటి స్థానంలో నిలిచి కత్రినా రికార్డు నెలకొల్పారని ఎఫ్‌హెచ్ఎం వర్గాలు అంటున్నాయి.

తను మరోసారి శృంగార తారగా నెం.1 స్థానంలో నిలవడంపై కత్రినా ఆనందం వ్యక్తం చేసింది. సెక్సీ అనే పదానికి పొట్టి దుస్తులు వేసుకోవడం, అందాలు ఆరబోయడం ఒక్కటే కాదని, మేక్ లేకుండా ఇతరులను ఆకట్టుకోవడం కూడా సెక్సీ అనే పదానికి వర్తిస్తుందని చెప్పుకొచ్చింది కత్రినా.

ప్రస్తుతం కత్రినా సల్మాన్ ఖాత్‌తో జతగా ‘ఏక్ థా టైగర్' చిత్రంలో నటిస్తోంది. వీటితో పాటు ధూమ్ 2, దోస్తానా 2, నమక్, రాజ్ నీతి 2 చిత్రాల్లో కూడా అవకాశం దక్కించుకుంది. యష్ రాజ్ చోప్రా నిర్మిస్తున్న అన్ టైటిల్ ప్రాజెక్టులో కూడా క్రతినా ఎంపికైంది.