6 జులై, 2012

మరోసారి నగ్నంగా....అభిమానులకు పండగే!బాలీవుడ్ హాట్ మోడల్ పూనమ్ పాండే మరోసారి నగ్నంగా అభిమానులకు కనువిందు చేసేందుకు సిద్ధం అవుతోంది. ఇటీవల షారుఖ్ జట్టు ఐపీఎల్-5 టైటిల్ గెలిచినందుకు ఉబ్బితబ్బిబ్బయి న్యూడ్‌గా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన పూనమ్ పాండే ఈ సారి స్పెయిన్ యూరో కప్ విన్నర్ అయిన నేపథ్యంలో నగ్నంగా సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధం అవుతోంది.

ఈ విషయాన్ని పూనమ్ ట్విట్టర్లో వెల్లడించింది. ‘నా ట్విట్టర్ అభిమానులు స్పెయిన్ విన్నర్ అయిన సందర్భంగా బట్టలు విప్పి నగ్నంగా కనిపించమని అడుగుతున్నారు. ఒకే నేను ట్రై చేస్తాను...త్వరలోనే సర్‌ప్రైజ్ ఇస్తాను' అంటూ పూనమ్ ట్వీట్ చేసింది. దీంతో ఆమె నగ్న అందాలు ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ పిచ్చెక్కి పోతున్నారు ఫ్యాన్స్.

మరో వైపు ఈ రోజు ఇంటర్నేషనల్ బికినీ డే కావడంతో ఈ రోజుంతా ట్విట్టర్లో బికినీలతో బీభత్సం సృష్టిస్తానని అభిమానులకు మాటించింది ఈ వయ్యారి. ఆమె మాటలకు పొంగి పోయిన అభిమానులు ఈ రోజు ఇంటర్నేషనల్ బికినీడే కాదు...ఈ రోజు పూనమ్ పాండే డే అంటూ, బికినీల విప్లవం సృష్టించాలి అంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

త్వరలో పూనమ్ సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పుడొస్తున్న సినిమాల్లో సెక్స్‌ను సరిగా చూపించడం లేదు. రియల్ సెక్స్ అంటే ఏమిటో నేను నా సినిమాల ద్వారా చూపిస్తానంటూ...తన ఎంట్రీపై అంచనాలు పెంచుకుంటోంది పూనమ్. ఇలాంటి ప్రకటనలతో తనకంటూ ప్రత్యేకమైన అభిమాన వర్గాన్ని ఏర్పరచుకున్న పూనమ్ పాండే...ట్విట్టర్ ఫాలోవర్స్ విషయంలో ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్‌ని మించి పోయింది.