10 జులై, 2012

‘జులాయి’ మరింత వెనక్కి...ఆగస్టు 9న రిలీజ్
అల్లు అర్జున్, ఇలియాన జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘జులాయి' చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఈచిత్రాన్ని జులై 13 విడుదల చేయాలని నిర్ణయించినా ఈగ చిత్రంతో పాటు ఇతర చిత్రాల పోటీ, థియేటర్ల సమస్య కారణంగా వాయిదా పడ్డ విషయం తెలిసిందే. తాజాగా అందిన అఫీషియల్ సమాచారం ప్రకారం ఈచిత్రాన్ని ఆగస్టు 9న విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈచిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కె. రాధకృష్ణ నిర్మాతగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డివివి. దానయ్య సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఇటీవలే సినీ ప్రముఖుల సమక్షంలో విడుదలైన విషయం తెలిసిందే. గతంలో బన్నీ, దేవిశ్రీ కాంబినేషన్లో వచ్చిన ఆర్య, ఆర్య 2 ఆడియో ఘన విజయం సాధించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.

జీవితాన్ని ఆస్వాదించడం ఎలాగో చాలామందికి తెలీదు. పరుగులు తీసే వయసులో చదువు, ఉద్యోగం.. అంటూ ముందర కాళ్లకు బంధమేసుకొంటారు. అన్నీ అందాక... ఇక పరిగెట్టే ఓపిక ఉండదు. అందుకే జోష్‌ ఉన్నప్పుడే జల్సా చేయాలి... అన్నది ఆ కుర్రాడి సిద్ధాంతం. జులాయి, దేశముదురు అని పిలుస్తారేమో అన్న బెంగలేదు. ఈ బిరుదులుంటేనే అమ్మాయిలు సులభంగా ప్రేమలో పడిపోతారనేది అతని నమ్మకం. అదే నిజమైంది. ఓ అందాల భామ ఈ జులాయికి మనసిచ్చేసింది. ఆ తరవాత ఏం జరిగిందనేది జులాయి చిత్రం స్టోరీ లైన్.

ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: రవీందర్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, బ్యానర్: హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సమర్పణ: డివివి దానయ్య, నిర్మాత: ఎన్. రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్.